అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, అక్టోబర్ 01, 2018

నవాబ్...

ఎక్కడనుండో వలస వచ్చిన ఒక అనామకుడిగా మొదలుపెట్టి చిన్న సైజు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు వరద(అరవింద్ స్వామి) తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకి దళపతిలా పనిచేస్తుంటాడు. రెండవ వాడు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్ లో తన దందాని నిర్వహిస్తుంటాడు. మూడవ వాడు రుద్ర(శింబు) సెర్బియా లో అక్రమ ఆయుధ రవాణా చేస్తుంటాడు. ఒక బాంబు దాడిలో దెబ్బతిన్న తండ్రిని చూడడానికి వచ్చిన ముగ్గురు కొడుకుల మధ్య తండ్రి తర్వాత వారసత్వం ఎవరిది అనే చర్చ మొదలవుతుంది. ఆ చర్చ దేనికి దారితీసింది,...

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

యూ-టర్న్...

మన దేశంలో తప్పు చేయని వాళ్ళు ఉండవచ్చేమో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించని వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఉండరనే చెప్పవచ్చు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఏ ఒక్కరికీ రోడ్ మీద ఒక్క క్షణం ఎదురు చూసే ఓపిక సహనం అస్సలు ఉండవనే విషయం రోడ్లపై ప్రయాణించే ప్రతిసారి మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తూ దానిని అతిక్రమిస్తే వచ్చే ఊహించని పర్యవసానాలు ఎలా ఉండవచ్చో వివరించే సినిమా యూ టర్న్. మాములుగా ఈ విషయం చెప్తే ఒక డాక్యుమెంటరీ అవుతుంది కానీ ఈ సందేశాన్ని ఇవ్వడానికి కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఎన్నుకున్న...

మంగళవారం, సెప్టెంబర్ 11, 2018

కేరాఫ్ కంచరపాలెం...

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదివినా అడపా దడపా పేరు వినడమే తప్ప ఎప్పుడూ చూసిన దాఖలేల్లేవు ఈ కంచరపాలెం ని కానీ ఇపుడు దర్శకుడు వెంకటేష్ మహా పుణ్యమా అని అక్కడ అణువణువు పరిచయమున్నట్లే అనిపిస్తుంది. సాధారణంగా సినిమాలో చూసిన మనుషుల్నీ, లొకేషన్స్ ని బయట చూస్తే నేనంతగా పోల్చుకోలేను. అదేంటో తాజ్ మహల్ తో సహా ఏదైనా స్వయంగా కళ్ళతో చూసినపుడు ఒక రకంగా, ఫోటోలలోనూ వీడియోలలోనూ చూసినపుడు ఒక రకంగా కనిపిస్తాయ్ ఆ సహజత్వాన్ని కెమేరాలో కాప్చర్ చేయడం అంత సాధారణమైన విషయం కాదు. అలాంటి ఒక అసాధారణమైన పనిని విజయవంతంగా చేసి చూపించారు కేరాఫ్ కంచరపాలెం...

సోమవారం, జనవరి 22, 2018

అమ్మ...

అమ్మ అంటే లాలనకూ నాన్నంటే క్రమశిక్షణకూ మారుపేరని లోకరీతి కానీ మా ఇంట్లో మాత్రం నాన్నారు మమ్మల్ని సాధారణంగా ఏమీ అనేవారు కాదు అమ్మ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవారు. అదికూడా కోప్పడకుండానే ఓపికగా నెమ్మదిగా తియ్యగా చెప్తూనే మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుండేది. ఒకోసారి అబ్బా ఏంటో అమ్మ ఇన్ని రూల్స్ పెడుతుంది అసలు చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోతే బావుండు అప్పుడు తెలిసొస్తుంది అమ్మకి అని అనిపించేది కానీ హాస్టల్ పేరుతో మొదటిసారి దూరంగా ఉన్న రోజు నాన్న కంటే అమ్మే ఎక్కువ గుర్తొచ్చి బోలెడంత దిగులేసేది. నాకు చిన్నపుడు అత్యంత కష్టమైన పని స్నానం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.