అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, నవంబర్ 28, 2017

మెంటల్ మదిలో...

సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే మనందరం ఏది ఎన్నుకోవాలా అని అంతో ఇంతో కన్ఫూజ్ అవడం సహజం, మన అభిరుచి, అనుభవం, అవసరం ఇత్యాదులని బేరీజు వేసుకుని ఆలోచించి సరైన ఆప్షన్ ఎన్నుకుని ముందుకు సాగుతాం. ఐతే ఈ కన్ఫూజన్ మితిమీరిన మోతాదులో ఉన్న వ్యక్తే అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు). చిన్నతనం నుండీ కూడా ఆ రోజు ఏ డ్రస్ వేస్కోవాలో తల్లి డిసైడ్ చేసి ఇస్తే తప్ప రోజు మొదలవని అరవింద్ స్కూల్లో పరీక్షల్లో కూడా ఎస్సేటైప్ ఆన్సర్స్ పేజీలకు పేజీలకు రాసేసి మల్టిపుల్ ఛాయిస్ కొశ్ఛన్స్ కి మాత్రం తెల్లకాగితం ఇచ్చి వచ్చే రకం. ఎంతపెద్దైనా ఈ కన్ఫూజన్ అలా కొనసాగుతూనే...

శుక్రవారం, నవంబర్ 10, 2017

శమంతకమణి...

హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర నుండీ తనకి దూరమైన తల్లే తిరిగి వచ్చిందన్నంతగా సంబర పడుతున్న కృష్ణ ఆ కార్ ని వెతికి పట్టుకోవాలని పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ సహాయం కోరతాడు.  రంజిత్ కుమార్ (నారా రోహిత్)...

శనివారం, నవంబర్ 04, 2017

PSV గరుడవేగ 126.18M

డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తార్ మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి సారి థియేటర్లో చూస్తున్నా మామా" అని అనుకోవడం విని నవ్వుకున్నాను.  సినిమా మొదటిసగం పూర్తయే సరికి వావ్! వావ్! వావ్! వావ్! వాటే మూవీ! అనుకుని ఆశ్చర్యపోవడం నా వంతైంది. రెండవ సగం పూర్తయేసరికి...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.