అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, మార్చి 25, 2015

ఎవడే సుబ్రహ్మణ్యం...

నువ్వెవరు? అనేది చాలా సింపుల్ గా కనిపించే అతి కష్టమైన ప్రశ్న. చాలామందికి అది సమాధానం లేని ప్రశ్న కూడా. ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనే ఆశ రిషి(విజయ్)ని హిమాలయాల్లోని దూద్ కాశి (ఆకాశ గంగ) ప్రయాణానికి పురిగొల్పుతుంది. ఆపేరు మొదటిసారిగా టెంత్ లో తన బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం(నాని) తో కలసి విన్నాడు కాబట్టి ఆ ప్రయాణం కూడా తనతోనే చేయాలని నిర్ణయించుకుంటాడు. "డబ్బుదేముంది బాస్ కూటికోసం కోటి విద్యలు, జీతం కన్నా జీవితం విలువైనది ఎప్పుడు ఎంజాయ్ చేశావ్ అని అడిగితే వేళ్ళమీద లెక్కపెట్టుకునే పరిస్థితి నాకొద్దు" అనే ఫిలాసఫీ రిషిది. అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.