శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015

మా టీవీలో ఓనమాలు on 7th Feb 8PM

మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని ప్రోత్సహించడం అటువంటి చిత్రాలని అభిమానించే వారు తప్పక చేయవలసిన పని. ఇంచుమించు రెండేళ్ళ క్రితం "క్రాంతిమాధవ్" దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని చిత్రం "ఓనమాలు". ఈ చిత్రానికి ఖదీర్ బాబు రాసిన పదునైన సంభాషణలు ఆకట్టుకుంటూనే ఆలోచింప చేస్తాయి. ఇంత చక్కని సినిమాను మాటీవీ వారు ఈ శనివారం ఫిబ్రవరి 7 న రాత్రి 8 గంటలకు మొదటిసారి ప్రసారం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైనపుడు చూడడం కుదరని వారు ఈ సదవకాశాన్ని వదులుకోకుండా తప్పక చూడండి. ఈ చిత్రం పై అప్పట్లో నేను రాసిన రివ్యూ ఇక్కడ చదవచ్చు.  ఈ చిత్ర దర్శకుడు "క్రాంతిమాధవ్" "శర్వానంద్", "నిత్యామీనన్" జంటగా తీసిన కొత్త చిత్రం "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" ఈరోజే (ఫిబ్రవరి ఆరున) విడుదలై "మళ్ళీ మళ్ళీ రావిలాంటి చిత్రాలు" అంటూ విమర్శకుల అభినందనలు పొందడం సంతోషించ దగిన విషయం.

4 వ్యాఖ్యలు:

 1. ఈ సినిమాకోసం ఎన్ని రోజులనుండీ ఎదురుచూస్తున్నానో.ధన్యవాదాలు,ముందుగానే తెలిపినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. I am waiting for this movie from a long time..Is it feb7th or 8th ?? I am in US.. It was "julayi" movie on feb 7th 8 pm

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఓహ్ సారీ అండీ... వాళ్ళు ఇచ్చిన ప్రోమోస్ ప్రకారం అయితే ఫిబ్ సెవెన్త్ శనివారం రాత్రే రావాల్సి ఉందండీ.. బహుశా ఏవైనా వేరే ఇబ్బందుల వల్ల మార్చేశాడేమో. ఇక్కడ ఇండియా లో కూడా జులాయ్ సినిమాయే టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఎపుడో తెలిస్తే ఇక్కడ కామెంట్స్ లో అప్డేట్ చేస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఫ్రెండ్స్, ఇపుడీ ఓనమాలు చిత్రాన్ని యూ ట్యూబ్ లో చూడవచ్చు.
  ఇక్కడ చూడండి : https://www.youtube.com/watch?v=j0hIc0rM8nc

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.