అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, ఆగస్టు 22, 2014

ఊహలు గుసగుసలాడే...

ప్రేమ !... రెండక్షరాల పదం... ఒక చిన్న ఫీలింగ్ / ఎమోషన్... సినిమాలు మొదలయినప్పటినుండీ... ఆమాటకొస్తే కథలు చెప్పడం మొదలైన దగ్గర నుండి కూడా ఇప్పటికి కొన్ని వేల సార్లు కథా వస్తువుగా ఉపయోగపడింది ఈ ప్రేమ, ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది. ప్రేమ కథలు ఎన్ని సార్లు విన్నా చూసినా బోర్ కొట్టవని కొత్తగానే ఉంటాయని పదే పదే హిట్ అయ్యే ఎన్నో ప్రేమకథలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అలాంటి ఒక ప్రేమకథకి ఆకట్టుకునే కథనం, చక్కని సంభాషణలు, సున్నితమైన హాస్యం కూడా తోడైతే... ఆ సినిమా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే "ఊహలు గుసగుసలాడే" సినిమా... ఈ...

శుక్రవారం, ఆగస్టు 15, 2014

మార్పు మనతోనే మొదలవ్వాలి...

  "మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు హీరో అల్లూ అర్జున్. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ నీ, అల్లూ అర్జున్ నీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సందేశాత్మకమైన లఘుచిత్రాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ లఘు చిత్రాన్ని క్రింది ఎంబెడ్ వీడియోలో లేదా ఇక్కడ చూడవచ్చు. మిత్రులందరికీ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.