అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, జులై 29, 2013

భాగ్ మిల్కా భాగ్

నాకు నచ్చిన సినిమాలంటూ ఈ బ్లాగ్ లో రాస్తుంటాను కానీ ఒకోసారి మరీ నచ్చిన సినిమాల గురించి అసలు పోస్ట్ రాసే సాహసం చేయను. ఎందుకంటే కొన్ని సినిమాలను చూసి ఆస్వాదించగలమే కానీ విశ్లేషించలేం. అలాంటి వాటిలో “భాగ్ మిల్కా భాగ్” కూడా ఒకటి. అయితే నేనీరోజు వరకూ వాయిదా వేసినట్లు సినిమా నిడివి గురించి భయపడి చూడకుండా ఎవరైనా మిగిలిపోయి ఒక మంచి సినిమాను మిస్ అవుతారేమోనని ఈ పోస్ట్ రాస్తున్నాను. మూడు గంటల తొమ్మిది నిముషాల ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా సాగదీసినట్లు అనిపించవచ్చు. సినిమాలో ఒక అరగంట సులువుగా ట్రిమ్ చేయగల సన్నివేశాలున్నట్లు నాకు కూడా అనిపించింది....

ఆదివారం, జులై 28, 2013

ఈ బాలుడూ మహా చోరుడు సుమీ!!

అవి నేను మా పాత వీధి బళ్ళోనే కొత్తగా నాలుగో తరగతిలో చేరిన రోజులు. ఆ ఏడాది మా బళ్ళో హనుమంతరావ్ అని ఒకడు చేరాడు. నిజానికి వాడి వయసు ప్రకారం వాడు ఏ ఏడోతరగతిలోనో ఉండాల్సిన వాడు కానీ డిటెన్షన్స్ తో బళ్ళు మారి ఇంకా నాలుగులోనే ఉన్నాడు. మా అందరికంటే పెద్దాడవడంతో వాడికి తెలియని విషయం, చేయని అల్లరి ఉండేది కాదు. నాఖర్మ కొద్దీ వాడు నాకు ఆర్యా-2 లాంటి ఫ్రెండ్. నేనెంత వదిలించుకోవాలని చూసినా తుమ్మబంకలా అంటుకునేవాడు. వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు...

శుక్రవారం, జులై 26, 2013

హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)

ఇది నా హాస్టల్ కబుర్లు టపాల సిరీస్ కు కొనసాగింపు. ఆ సిరీస్ గురించి తెలియని వారు ఇక్కడ క్లిక్ చేసి ముందు పది టపాలు చదవచ్చు.  ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు. ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు,...

బుధవారం, జులై 24, 2013

అత్తారింటికి దారేది – Audio My view.

మనమందరం చిన్నపుడు ఆడుకునే ఆటగుర్తుందా. అరచేతిని తీస్కుని అందులో సున్నాలు చుడుతూ ఆకేసి అని చెప్పి ఆ తర్వాత ఒక్కో వేలు ముడుస్తూ అన్నమేసి, పప్పేసి, నెయ్యేసి అని చెబుతూ అన్ని వేళ్ళు ముడవడం అయ్యాక మన వేళ్ళతో అవతలి వాళ్ళ చేతిమీదుగా నడకసాగిస్తూ అత్తారింటికి దారేది దారేది అని భుజం వరకూ తెచ్చి కితకితలు పెట్టి నవ్వించేవాళ్ళం. చివర్లో కితకితలు పెడతారని తెలుసుకాబట్టి చివరి వరకూ నవ్వకుండా ఉండడమనేది అసాధ్యం ఆట మొదలెట్టగానే ఆటోమాటిక్ గా నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా అద్యంతం నవ్వులు కురిపించే ఆట అది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కథ ప్రకారం ఆ ఆటలోని మాట...

ఆదివారం, జులై 14, 2013

సాహసం...

తనది పదేళ్ళ సినీ కెరీర్ కానీ తీసింది ఐదే సినిమాలు సంపాదించిన ఖ్యాతి మాత్రం అనంతం. ఐతే-2003, అనుకోకుండా ఒకరోజు-2005(ఇదే కాన్సెప్ట్ తో నాలుగేళ్ళ తర్వాత 2009 లో హాంగోవర్ అనే హాలీఉడ్ సినిమా వచ్చింది), ఒక్కడున్నాడు-2007 (ఇందులో ప్రధానాంశం గుండె మార్పిడి ఐతే లివర్ మార్పిడి ప్రధానంశంగా ఇదే తరహాలో ఐదేళ్ళ తర్వాత 2012 లో హాలీఉడ్ సినిమా విడుదలైంది), ప్రయాణం-2009, ఇపుడు 2013 లో సాహసం. ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమాలే వందలకొద్దీ నిర్మించే అలవాటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను తీసిన సినిమా మళ్ళీ తీయడం దేవుడెరుగు తీసిన జొనర్ లో మళ్ళీ తీయకుండా...

శనివారం, జులై 13, 2013

Pacific Rim / అంతిమపోరాటం

మీకు యాక్షన్ సినిమాలు ఏమాత్రం ఇష్టమైనా ఈ సినిమా మిస్ కాకండి, వీలైతే మీదగ్గరలో ఉన్న బెస్ట్ త్రీడీ థియేటర్ లో చూడండి. ఈమధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ త్రీడీ యాక్షన్ ఫిల్మ్ పసిఫిక్ రిమ్. చూడడానికి ట్రాన్స్ ఫార్మర్స్ తరహా జెయింట్ రోబోలలాగా కనిపించవచ్చు కానీ ఈ ఏగర్స్ (Jaegers) డిజైన్ కాన్సెప్ట్ అన్నీకూడా అద్భుతంగా ఉన్నాయ్ ముఖ్యంగా పోరాట సన్నివేశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్రీకరించారు. ఇక 3D ఎఫెక్ట్ గురించైతే చెప్పనే అఖ్ఖర్లేదు డెప్త్ చాలా స్పష్టంగా తెలుస్తుంది, కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తున్నట్లుకాక మనం ప్రత్యక్షంగా అక్కడ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.