అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, నవంబర్ 19, 2013

నమస్తే తెలంగాణ పేపర్ లో నేను

నేను కొన్నాళ్ళ క్రితం నవంబర్ చలి గురించి రాసుకున్న "చలి-పులి" అనే ఒక బ్లాగ్ ఆర్టికల్ "నమస్తే తెలంగాణ పేపర్" లోని 'వింటర్ గిలి' కాలమ్ లో మొన్న పద్దెనిమిది నవంబర్ సోమవారం (18-11-2013) నాడు ప్రచురిచతమైంది, ఈ సంధర్బంగా సెలెక్ట్ చేసిన ఆ పేపర్ ఎడిటోరియల్ కీ, అలాగే ఈ విషయాన్ని తన e-మెయిల్ ద్వారా తెలియపరచిన మధు గారికీ బ్లాగ్ముఖతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  ప్రచురించబడిన చలి-పులి ఆర్టికల్ పూర్తి వర్షన్ నా బ్లాగ్ లో ఇక్కడ చదవచ్చు.  నమస్తే తెలంగాణా పేపర్ వెబ్ వర్షన్ లోని ఆర్టికల్ ఇక్కడ, e-పేపర్ లోని వర్షన్ ఇక్కడ నొక్కి చదవచ్చు.  ...

శనివారం, నవంబర్ 02, 2013

నల్లజర్ల రోడ్ గురించి నేను

తిలక్ గారి "నల్లజర్లరోడ్" కథ గురించి నా పరిచయ వ్యాసం "వెంటాడి వేటాడే వెన్నెల దారి" ని e-సాహిత్య పత్రిక "వాకిలి" నవంబర్ నెల సంచికలో ఇక్కడ చదవండి. ఈ పత్రిక లింక్ లో పూర్తి కథ కూడా చదవచ్చు కనుక ఈ చక్కని కథను చదవనివారెవరైనా ఉంటే తప్పక చదవండి డోంట్ మిస్ ఇట్.  ఈ పోస్ట్ కేవలం నా బ్లాగ్ విజిటర్స్ కు సమాచారాన్ని అందించడం కొరకు మాత్రమే. దయచేసి మీ స్పందనలను కామెంట్స్ రూపంలో పత్రిక పేజ్ లోనే రాయవలసినదిగా మనవి.  నా వ్యాసాన్ని ప్రచురించిన వాకిలి సంపాదక వర్గానికి ధన్యవాదాలు. ఈ వ్యాసం రాసేలా నన్ను ప్రోత్సహించి చక్కని శీర్షికను సూచించిన సుజాత...

శనివారం, అక్టోబర్ 05, 2013

అత్తారింటికి దారేది

నాకు గుర్తున్నంతవరకూ తెలుగులో అత్తా అల్లుళ్ళ సినిమాలు అదీ ఒక స్టార్ హీరో అల్లుడు కారెక్టర్ వేస్తున్నాడంటే సాధారణంగా మరదలితో పెళ్ళే అల్టిమేట్ గోల్ గా ఉంటాయి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే అత్తని ఒక దుర్మార్గురాలిగా చూపించి హీరో తన పొగరణచడానికి మరదలు(ళ్ళ)తో పాటు అత్తతో కూడా సరసాలాడటం, డబల్ మీనింగ్ డైలాగులు/సీన్లు ఇలా నానా చెత్తతో నింపేస్తారు. నిజానికి త్రివిక్రమ్ ఇలా అత్తా అల్లుళ్ళ త్రెడ్ తీస్తున్నాడు అనగానే కాస్త భయపడినమాట వాస్తవమే కానీ తను “అత్తారింటికి దారేది” సినిమాకోసం అదే మూసలో వెళ్ళకుండా... ప్రేమ పెళ్ళి చేసుకుని తండ్రిమీద అలిగి ఇల్లొదిలి...

బుధవారం, ఆగస్టు 28, 2013

మిస్సవకూడని 2 సినిమాలు

అంతకుముందు ఆ తరువాత :  గ్రహణం, మాయాబజార్, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్. ఇపుడు ఈ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి అభిరుచిగల తెలుగు దర్శకులలో ఒకరు. తీసుకున్నది రొటీన్ సబ్జెక్ట్ (ప్రేమ, లివ్ఇన్ రిలేషన్ షిప్) అయినా కూడా దానిని తెరకెక్కించడంలో తెలుగుదనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా తెలుగు కుటుంబాలు ఎదుర్కొనే సాధారణ సమస్యలను డిస్కస్ చేస్తూ మంచి మంచి సంభాషణలతో చక్కని కారెక్టరైజేషన్స్ తో వాటికి తగిన నటీనటులతో రొటీన్ కి భిన్నంగా సహజంగా కనిపించేలా తీర్చిదిద్దినందుకు ప్రోత్సహించడానికైనా ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలి. కళ్యాణి కోడూరి...

ఆదివారం, ఆగస్టు 18, 2013

చీమలు దోమలు ఈగలు - చిట్కాలు

ఈ రోజు నేను మీకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు/హోం రెమెడిస్ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కొందరు పెద్దలు, మరి కొందరు ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుని నేను ప్రయత్నించి ఫలితం చూసినవి. చీమలు : ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేక బండలమధ్యో కొంత ప్లేస్ చేస్కుని చీమలు మనమీద దండయాత్ర చేసేవి అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సినో ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ మామూలు ఇళ్ళలోకూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో...

ఆదివారం, ఆగస్టు 04, 2013

ఓ ప్రయాణం

సమైఖ్యాంద్రా గొడవలూ, బంద్ ల వలన మూడురోజులుగా వాయిదా వేస్కుంటూ వస్తున్న తెనాలి ప్రయాణానికి  నిన్నటి రోజున ముహుర్తం పెట్టాను. కాస్త చల్లబడబోయే గొడవలకి మొన్న కే.సి.ఆర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లై మళ్ళీ నిన్న పొద్దున్న కాస్త హడావిడి ఎదురైంది. వాళ్ళని తప్పించుకుని ఎలాగైతేనేం గుంటూరు బస్టాండ్ చేరుకుని తెనాలికి నాన్ స్టాప్ టికెట్ తీస్కుని డీలక్స్ బస్సెక్కాను, బస్ కాస్త ఖాళీగానే ఉందికానీ ఉన్న కొందరూ విండో సీట్స్ ఆక్రమించుకునేసరికి నిండుగానే ఉన్నట్లు కనిపించింది.  ఖాళీగా ఉన్న ఒక సీట్ కాస్త మురికిగా ఉందనిపించి ఒకసారి చేత్తో...

గురువారం, ఆగస్టు 01, 2013

దొంగా - పోలీసూ - ఓ కోర్టు.

6th April-2013: సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది. ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో...

సోమవారం, జులై 29, 2013

భాగ్ మిల్కా భాగ్

నాకు నచ్చిన సినిమాలంటూ ఈ బ్లాగ్ లో రాస్తుంటాను కానీ ఒకోసారి మరీ నచ్చిన సినిమాల గురించి అసలు పోస్ట్ రాసే సాహసం చేయను. ఎందుకంటే కొన్ని సినిమాలను చూసి ఆస్వాదించగలమే కానీ విశ్లేషించలేం. అలాంటి వాటిలో “భాగ్ మిల్కా భాగ్” కూడా ఒకటి. అయితే నేనీరోజు వరకూ వాయిదా వేసినట్లు సినిమా నిడివి గురించి భయపడి చూడకుండా ఎవరైనా మిగిలిపోయి ఒక మంచి సినిమాను మిస్ అవుతారేమోనని ఈ పోస్ట్ రాస్తున్నాను. మూడు గంటల తొమ్మిది నిముషాల ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా సాగదీసినట్లు అనిపించవచ్చు. సినిమాలో ఒక అరగంట సులువుగా ట్రిమ్ చేయగల సన్నివేశాలున్నట్లు నాకు కూడా అనిపించింది....

ఆదివారం, జులై 28, 2013

ఈ బాలుడూ మహా చోరుడు సుమీ!!

అవి నేను మా పాత వీధి బళ్ళోనే కొత్తగా నాలుగో తరగతిలో చేరిన రోజులు. ఆ ఏడాది మా బళ్ళో హనుమంతరావ్ అని ఒకడు చేరాడు. నిజానికి వాడి వయసు ప్రకారం వాడు ఏ ఏడోతరగతిలోనో ఉండాల్సిన వాడు కానీ డిటెన్షన్స్ తో బళ్ళు మారి ఇంకా నాలుగులోనే ఉన్నాడు. మా అందరికంటే పెద్దాడవడంతో వాడికి తెలియని విషయం, చేయని అల్లరి ఉండేది కాదు. నాఖర్మ కొద్దీ వాడు నాకు ఆర్యా-2 లాంటి ఫ్రెండ్. నేనెంత వదిలించుకోవాలని చూసినా తుమ్మబంకలా అంటుకునేవాడు. వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు...

శుక్రవారం, జులై 26, 2013

హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)

ఇది నా హాస్టల్ కబుర్లు టపాల సిరీస్ కు కొనసాగింపు. ఆ సిరీస్ గురించి తెలియని వారు ఇక్కడ క్లిక్ చేసి ముందు పది టపాలు చదవచ్చు.  ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు. ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు,...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.