అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జూన్ 13, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 2

మొదటి భాగం ఇక్కడ చదవండి. కళ్యాణకట్ట క్యూలో తోసుకుంటూ ఒకళ్ళమీద ఒకళ్ళు నిలబడి ఎలాగో రెండున్నర గంటలు ఎదురు చూశాక కంపార్ట్మెంట్స్ లోకి వదిలాడు. అక్కడ కుర్చీలూ ఒక మంచినీళ్ళ కుళాయి ఉన్నాయి. అక్కడ కూర్చుని ఒక అరగంట ఎదురు చూశాక అక్కడనుండి కిందకి వదిలాడు. అలా వదిలేప్పుడు ఒక బార్ కోడ్ ప్రింట్ చేసున్న స్లిప్ మరియు సగం బ్లేడ్ మనచేతికి ఇస్తారు. ఆ కోడ్ తోపాటు ఒక నంబర్ ఉంటుంది కింద కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్ళినపుడు ఆ నంబర్ ఎక్కడ ఉందో వెతుక్కుని దానిదగ్గర ఉన్న క్షురకుని వద్దకు వెళ్ళి లైన్లో నించుంటే అతను గుండుకొడతాడు. ఆ ప్రదేశం అంతా కింద నీళ్లు వెంట్రుకలతో బ్యాగ్...

సోమవారం, జూన్ 04, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 1

ఆ ఆపద మొక్కుల వాడిని తలచుకోగానే నాకు ముందు గుర్తొచ్చేది తిరుమలలోని రద్దీనే... నేను ఇలా భయపడతాను కనుకనే ఏమో నేను ఎపుడు దర్శనానికి వెళ్దామనుకున్నా విపరీతమైన రద్ది ఉంటుంది. వెళ్ళి వచ్చిన తెల్లారి పేపర్ చూస్తే “తిరుమలలో పెరిగిన రద్దీ” అంటూ వార్త వస్తుంటుంది. అప్పటికీ రెండు వారాలక్రితం నేను ఇలా వెళ్దామనుకున్నపుడు బ్లాగ్ మిత్రులు శంకర్ గారు “ఇప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుందండీ ఒక్క రెండువారాలు, స్కూల్స్ తీసేవరకూ ఆగడం మంచిది” అని సలహా ఇచ్చారు కానీ ఆస్వామి ఆజ్ఞ అయితే కాదని వాయిదా వేయడానికి మనమెవరం? అదీ కాక ఇంచుమించు పుష్కరకాలం తర్వాత వెళ్ళాలని బుద్దిపుట్టింది...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.