మంగళవారం, ఏప్రిల్ 20, 2010

ఈ వేసవి లో పక్షులు చల్లగా ఉండాలని..నాకు ఫార్వర్డ్ చేయబడిన ఒక ఈమెయిల్ సాధ్యమైనంత మందికి చేరుకోవాలని. మనవంతుగా ప్రతి ఒక్కరు ఆచరించాలని ఇక్కడ ఇస్తున్నాను. నాకు ఫార్వర్డ్ చేసిన నానేస్తానికీ (జాజిపూలు నేస్తం కాదు:-) ఈ బ్యానర్ తయారు చేసిన http://www.chennaiepages.com/ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేసవి అనే కాదు అన్ని కాలాల్లోనూ మీ బాల్కనీల్లోనో పిట్టగోడ పైనో తోటలోనో ఇంటి ఆవరణ లోనో మీకు వీలైన ప్రదేశం లో పక్షులకోసం ఒక చిన్న పాత్రలో ఇలా నీటిని అందుబాటులో ఉంచడం మంచి ఆలోచన. బ్యానర్ చేసినపుడు 37C మాత్రమే దాటినట్లుంది ఇపుడు 42C కూడా దాటిందనుకుంటాను వేసవి తాపం.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఆస్ట్రేలియాలో ఓ వారం రోజులపాటు 120F డిగ్రీల ఉష్ణోగ్రత మాడ్చేసినపుడు ఇదివరకు ఎన్నడూ లేని విథంగా అక్కడి Koalas ( వీటి గురించి వివరాల కోసం ఇక్కడ నొక్కండి ) మనుషులను నీటి కోసం ప్రాథేయపడటం ఈ చిత్రాలలో చూడవచ్చు. వేసవి తాపం మూగజీవాలను సైతం ఎంతగా బాధపెడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

AT 120 DEGREES IN AUSTRALIA , IT WAS SO HOT FOR A WEEK THAT KOALAS WERE ASKING PEOPLE FOR WATER . IT'S NEVER BEEN SEEN BEFORE.  


"Until one has loved an animal, part of their soul remains unawakened."

16 వ్యాఖ్యలు:

 1. నిజమండీ.. ఆలోచించాల్సిన విషయం..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నే పెట్టేశా కదా :) మా బాల్కని లో ఓ బుజ్జి పిట్ట గూడు కూడా పెట్టింది, కానీ దానికి బోల్డంత భయం, తలుపు తీస్తే తుర్ర్ మని ఎగిరిపోతుంది, లేదా ఊసల మీద వాలి మెడ తిప్పుతూ అరుస్తూ ఉంటుంది, దాన్ని తలుపు చాటు నుంచి చూడాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మేము ఎప్పుడూ పెడతాము . నీళ్ళేకాదు , కాసిని బియ్యం గింజలు కూడా చల్లుతాము . మా తులసి కోటలో ఎప్పుడూ పావురాలు గుడ్లను పెట్టి పొదుగుతాయి . వాటిని గమనిస్తూ వుండటము , పిల్ల బయటికి రాగానే , వాటికి పేర్లు పెట్టటము , అవిరెక్కలొచ్చి ఎగిరి పోగానే దిగులు పడటము , మళ్ళీ కొత్తవాటికోసం ఎదురుచూడటమూ మా పిల్లల దినచర్య .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కొత్తపాళి గారు నెనర్లు :-)

  మురళి గారు నెనర్లు :-) ఆలోచించడమే కాదండీ ఆచరణలో కూడా పెట్టవలసిన విషయం.

  నేను గారు నెనర్లు :-) ఆహా మీరు అల్రెడీ పెట్టేశారా అభినందనలు :-) హ హ మీ బుజ్జిపిట్ట దాగుడు మూతల కబుర్లు భలే ఉన్నాయండి :-)

  మాలా కుమార్ గారు నెనర్లు : మీక్కూడా అభినందనలు ఆచరిస్తున్నందుకు. మీ పావురాల కబుర్లు ఇక్కడ పంచుకున్నందుకు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఇందాకే నాకు ఆ మెయిల్ వచ్చిందండి, నేను వీలైనంత మందికి పంపాను...మీరు దీని గురించి టప రాసి మంచి పని చేసారు...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రాజేంద్రప్రసాద్ గారు నెనర్లు :-) అందరికీ ఫార్వార్డ్ చేసినందుకు అభినందనలు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అహాహ అహహా ఎక్కడ నేస్తం అని ఉన్నా అదినేనే ..దాని పై కాపీ రైట్స్ టీ రైట్స్ అన్నీ నావే..

  హూ ఇప్పుడు జంతువుల పరిస్థితి రేపు మనం ..ఇప్పటికే ఎండలు చూసారా ఎలా ఎక్కువ గా ఉంటున్నాయో..భరించలేకపోతున్నాం అంటున్నారు అమ్మా,వాళ్ళు.. నేనైతే పగటి పూట లైటు ,ఫేన్ బంధ్.. మా ఆయన గాని ..ఎవరింటిలో నైనా గాని కరెంట్ అనవసరం గా వాడితే తిట్టాలనే కసి వస్తుంది.. ఇండియా వస్తే మెల్లి మెల్లి గా ఫ్రిజ్ గట్రా బంధ్ చేసి కుండ నీళ్ళు త్రాగాలని ప్లాన్ లో ఉన్నా..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నేస్తం గారు నెనర్లు :-) హ హ అంతటితో ఆపేశారా :-) లేక కాంప్లాన్ రైట్స్ బూస్ట్ రైట్స్ కూడా మీవేనంటారా :-p

  రేపు మనం అని బాగా చెప్పారు. వేసవి కాలం కుండలో నీళ్ళతో సరిపెట్టినా పాలు పెరుగు కూరల లాంటివాటికోసం ఫ్రిజ్ తప్పని సరండీ, పూర్తిగా మానేయకున్నా ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్రిజ్ కొనుక్కోవడం. వేడి పదార్ధాలు చల్లారాక ఫ్రిజ్ లో పెట్టడం లాంటి చిన్న చిన్న చిట్కాలతో ఎనర్జీ వృథా కాకుండా అడ్డుకోవచ్చు.

  అలానే నీటి ఉపయోగం లోనూ చేతులు కడిగేప్పుడు వాష్ బేసిన్ పంపు పూర్తిగా తిప్పి నీటిని వదిలేయకుండా అవసరమైనంత మేరకే తెరవడం వలన కూడా మనవంతు నీటిని ఆదా చేయచ్చు. కాస్త ఆలోచిస్తే ఇలాంటి వృథాలను చాలా అరికట్టవచ్చు. మీరు మంచుపల్లకి గారి పర్యావరణం టపా చదివారా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వేణూ గారు! మంచి విషయం చెప్పారు. నేను పక్షుల కోసం నీరు పెడదామనుకుంటాను కాని పెట్టను. ఈ వేసవిలో పెడతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శ్రీకాంత్ గారు! ఈరోజు పక్షులకు నీరు పెట్టాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. సవ్వడి గారు నెనర్లు :-) పక్షులకోసం నీరు ఉంచినందుకు అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. వెరీ గుడ్డు , మీ జంతు ప్రేమకి . పాపం జంతుజాలం అరవనైన అరుస్తాయి. కాని చెట్ల పరిస్థితి ఏమిటో అందరు తలా ఒక చేయి వేస్తే అవి కూడా జీవం పోసుకున్టై. వేణు జీ నేను బ్లాగేశాను చదివి మీ అభిప్రాయం చెప్పాలి మరి sirisekhar.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 13. అరె ఏమైంది నా వ్యాక్య పాప్ అప్ లో రావడం లేదు , క్యా హోగయ .......

  ప్రత్యుత్తరంతొలగించు
 14. శిరీష గారు నెనర్లు :-) నిజమే చెట్లను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ వేసవి లో..
  మీ బ్లాగ్ చూశాను బాగుంది అక్కడే కామెంటాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మీ వ్యాఖ్య సరైన సమయానికే వచ్చిందండీ.. మీరు చూసినపుడు రిఫ్రెష్ అవలేదేమో బహుశా..

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.