అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, ఏప్రిల్ 20, 2010

ఈ వేసవి లో పక్షులు చల్లగా ఉండాలని..

నాకు ఫార్వర్డ్ చేయబడిన ఒక ఈమెయిల్ సాధ్యమైనంత మందికి చేరుకోవాలని. మనవంతుగా ప్రతి ఒక్కరు ఆచరించాలని ఇక్కడ ఇస్తున్నాను. నాకు ఫార్వర్డ్ చేసిన నానేస్తానికీ (జాజిపూలు నేస్తం కాదు:-) ఈ బ్యానర్ తయారు చేసిన http://www.chennaiepages.com/ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేసవి అనే కాదు అన్ని కాలాల్లోనూ మీ బాల్కనీల్లోనో పిట్టగోడ పైనో తోటలోనో ఇంటి ఆవరణ లోనో మీకు వీలైన ప్రదేశం లో పక్షులకోసం ఒక చిన్న పాత్రలో ఇలా నీటిని అందుబాటులో ఉంచడం మంచి ఆలోచన. బ్యానర్ చేసినపుడు 37C మాత్రమే దాటినట్లుంది ఇపుడు 42C కూడా దాటిందనుకుంటాను వేసవి తాపం. ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~ ఆస్ట్రేలియాలో...

శనివారం, ఏప్రిల్ 17, 2010

హాస్టల్ - 5 (శతృవు)

పిల్లల్ని కొట్టి శారీరకంగా హింసించే తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ పాలిట, వారి వ్యక్తిత్వం పాలిట మొదటి శతృవులు అని నా ప్రఘాడ విశ్వాసం. అయితే ఇది నాలుగు గోడల మధ్య అయినపుడు కొంతలో కొంత పర్వాలేదేమో అనిపిస్తుంది, కానీ  పిల్లలకు కూడా ఆత్మ గౌరవమనేది ఒకటుంటుందనే విషయం మరిచి నలుగురు ముందు హేళన చేయడం, చేయి చేసుకోడం, అవమానించడం లాంటి పనులతో వారిని మానసికంగా గాయపరిచే తల్లిదండ్రులు భవిష్యత్ లో ఆ పిల్లలు సైకోలు గా తయారవడానికి స్వచ్చందంగా రహదారులు వేస్తున్నారు అని నా అభిప్రాయం. అయితే ఇది అన్ని సార్లు కరెక్ట్ కాదు అని నిరూపించిన వాడు మా రాజేష్ (పేరు మార్చడమైనది),...

శనివారం, ఏప్రిల్ 03, 2010

హాస్టల్ - 4 (పరోఠాల బిజినెస్)

మా కాలేజ్ విజయవాడ కు దగ్గరలో బందరు వెళ్తుంటే ఈడ్పుగల్లు అనే గ్రామానికి ఒక కిలోమీటర్ ఇవతల ఉంటుంది. అంటే మేమున్న ఏరియాని కూడా ఈడ్పుగల్లు అనే అనేవారు. మాకు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం లో బందర్ రోడ్డు లోనే విజయవాడ వైపు గంగూరు అనే ఊరుండేది. అక్కడ మా కాలేజ్ కన్నా కాస్త మంచి పేరున్న నలంద రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది. దానికన్నా ముఖ్యంగా గంగూరు బస్టాప్ దగ్గర ఒక ధాభా ఉండేది, దాని పేరేంటో గుర్తు లేదు కానీ మేమంతా దాన్ని గంగూరు ధాభా అనే పిలిచేవాళ్ళం. అక్కడ పరోఠాలు చాలా బాగుండేవి.పరాఠాలు అంటే నార్త్ ఇండియన్ ఆలూ పరాఠా, మేతీ పరాఠా, గోభీపరాఠా లాంటి సాథారణమైన పరాఠాలు...

గురువారం, ఏప్రిల్ 01, 2010

హాస్టల్ - 3 ( చెఱకు తోట )

మా కాలేజ్ బిల్డింగ్ పొడవుగా ఉండేది మొత్తం నాలుగు అంతస్థులు. ఈ పక్కన ఫోటోలో ఉన్నది మాకాలేజే :-)  కింది ఫ్లోర్ లో హాస్టల్ రూంస్ పై ఫ్లోర్స్ లో కొన్ని క్లాస్ రూంస్ మరియూ హైస్కూలు క్లాసులు జరిగేవి వాటికి పైన డాబా మీద ఒకవైపు వరుసగా మా క్లాస్ రూములు వాటికి ముందు బోలెడంత ఖాళీ స్థలమూ ఉండేది. పగలు రూముల్లో క్లాసులు జరిగితే ఉదయం సాయంత్రం ఆ ఆరుబయట డాబా మీద స్టడీ అవర్ జరిగేది. మొదట్లో కిందే కూర్చునే వాళ్ళం డాబా చుట్టూ నాలుగడుగుల ఎత్తు పిట్ట గోడ ఉండేది. పైన ఆర్చిల్లా కనబడుతున్నాయ్ కదా అవి నా ఫస్టియర్ లాస్ట్ లో కట్టారు లేండి. ఒక రోజు రాత్రి స్టడీ అవర్ లో...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.