అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, మార్చి 30, 2010

లీడర్ & ఏ మాయ చేసావె

ఈ రెండు సినిమాల గురించే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలం లో నేను చూసినది ఈ రెండు సినిమాలనే.. ఇంకా రెండు సినిమాల్లోనూ ఏదో చెప్పాలి అని మంచి ప్లాట్ తో సినిమా మొదలు పెట్టి ఏం చెప్పాలో అర్ధం కాక మాములు గా వదిలేసినట్లు అనిపించింది. రెండూ కూడా గొప్ప సినిమాలు కాకపోయినా ప్రోత్సహించదగిన మంచి ప్రయత్నాలు. రెండు సినిమాల దర్శకుల పై నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి ఈ రెండు సినిమాలు డైలాగ్ బేస్డ్ సినిమాలు, ఈ సినిమాలను వినాలి, మనసుపెట్టి చూడాలి, పాత్రల స్వభావాలను కాస్తయినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి అపుడే సినిమాను మరింత ఆస్వాదించగలం....

సోమవారం, మార్చి 29, 2010

పది పైసలు

మరుగున పడిపోకుండా పదిల పరచుకోవలసిన వాటిలో మధురమైన ఙ్ఞాపకాల తర్వాత మొదటి స్థానం కరెన్సీదేనేమో. చిన్నప్పటి నుండి నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం ఒకటుండేది. ఎక్కువ విలువ ఉన్న డబ్బులు నీళ్ళలో వేస్తే నానిపోయే కాగితంతో చేస్తారు కానీ తక్కువ విలువ ఉండే చిల్లరను కలకాలం నిలవుండే మెటల్ తో తయారు చేస్తారు ఎందుకో ఎంత ఆలోచించినా నా బుర్రకి ఇప్పటికీ అర్ధంకాని ప్రశ్నే. కాస్త పెద్దయిన తర్వాత బహుశా విలువ తక్కువ ఉండే చిల్లరకు వాడుక ఎక్కువ కనుక కాగితాలు త్వరగా పాడవుతాయ్ అని నాణేలు ఉపయోగించారేమో లే అని నాకు నేను సర్ధి చెప్పుకున్నాను, మరి ఇది కాక వేరే కారణమేదైనా...

శుక్రవారం, మార్చి 26, 2010

ఆనందం.. అంతలోనే అంతర్ముఖం !

I have a dream.. ఇది సరైన ప్రయోగమేనా.. MLK గారి స్పీచ్ గుర్తొచ్చి ఆవేశంగా మొదలెట్టాను కానీ సరైన ప్రయోగం కాదేమో, ఎందుకంటే ఈ కల ఇప్పుడు రావడం లేదు, అదీకాక తీరిన ఈ కల గురించే ఈ టపా కనుక ఈ ప్రయోగం సరికాదనే అనుకుంటున్నా. ఏమో లెండి ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టెన్స్ లు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాయ్. ఏదేమైనా గ్రామర్ సంగతి ఇంగ్లీష్ టీచరమ్మలకి వదిలేసి అసలు విషయానికి వస్తే, ఈ బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో నేనో కలగనే వాడ్ని. నేనేదో బిజినెస్ లంచ్ కో, లేదూ డిన్నర్ పార్టీ కో, పెళ్ళికో, పుట్టినరోజు వేడుకకో వెళ్ళి పదిమందితో కలిసి మాట్లాడుతున్నపుడు హఠాత్తుగా ఒక...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.