అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

ఆదివారం, మే 24, 2009

బదిలీ...

2009 కొత్త సంవత్సరం మొదటి రోజు నన్ను ఏమిటి రా విశేషాలు? అని అడిగిన వారికీ, అడగని వారికీ నేను ఒకటే జవాబు చెప్పాను."ఆ ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే రొటీన్ రోజూ, "లైఫ్ ఈజ్ బోరింగ్ యూనో..." అని. మరి శేషతల్పం పై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి ఓ అరక్షణం కనులు అరమోడ్పులు చేసి, చెవులు రిక్కించి నా మాటలు విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడో... లేకా హిమగిరి పై తపస్సు చేసుకుంటున్న మహేశ్వరుడు ఓ క్షణం కనులు తెరిచి ఆహా అవునా అని వెటకారం గా అనుకున్నాడో కానీ...ఆ క్షణం నుండీ శివకేశవులు ఇద్దరూ కలిసి చెరో వైపూ నుండి నా జీవితం తో బంతాట ఆడేసుకుంటున్నారు......

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.