అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, మార్చి 30, 2009

బ్లాక్ ఐస్ !!

శీర్షిక చూడగానే "నల్లా నాల్లాని కళ్ళా.. పిల్లా...నీ మొగుడయ్యే వాడెల్లా.. ఉండాలొ కాస్త చెప్పమ్మా.." అని పాడేసుకుంటున్నారా.. ఆగండాగండి నేనేమీ నీలి కళ్ళ నీలిమ గురించి చెప్పబోవట్లేదు.. అంత లేదండీ.. ఇది ఆ ఐస్ గురించి కాదు ఇంకో ఐస్ గురించి. ఏంటబ్బా!! అని తెగ ఆలోచించేయకండి మరి, నెనెలాగు చెప్పేస్తున్నాను కదా ఆలకించండి. అసలు ఈ ఆంగ్ల భాష లో ఉన్నంత తికమక మరే భాషలోనూ లేదు. అంటే అక్కడికి నేనేదో పివి నరసింహ రావు గారి లా ఓ పాతిక భాషలు ఔపోసన పట్టేసానని కాదు కానీ, ఉదాహరణకి ఈ ఐస్ నే తీసుకోండి eyes ని ice ని ఒకేలా పలికి చస్తే తేడా ఎలా తెలిసేది. బహుశా పదం కని పెట్టినవాడి...

శనివారం, మార్చి 28, 2009

ఉగాది శుభాకాంక్షలు

అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు, కాస్త ఆలశ్యంగా. ఏం చేయమంటారు చెప్పండి మరి, ఫలానా రోజే పండగ అనుకునే కన్నా మనకి అనువు గా ఉన్న రోజే పండగ అని జరుపుకోడం అలవాటయి పోయింది మరి. ఉగాది అనగానే మొదట గుర్తు వచ్చేది ఉగాది పచ్చడే నేమో కదా... దీనికి కావలసిన అన్ని దినుసులు సులువు గానే దొరుకుతాయ్ కానీ వేప పూత కోసమే కాస్త కష్ట పడాలి, అంటే ప్రస్తుతం ఇంట్లో పచ్చడి చేసేది తక్కువేనేమో... నా చిన్నతనంలో వేప పూతనీ, మామిడి పిందెలనీ కష్ట పడి వెతికి పట్టుకుంటే, కాస్త పెద్దయ్యాక మార్కెట్ కి వెళితే ఏవి కావాలంటే అవి దొరకేవి. ఇంకాస్త పెద్దయ్యాక స్వగృహలాంటి చోట్ల ఉగాది...

సోమవారం, మార్చి 02, 2009

అమ్మకు అశృ నివాళి !!

ఇటువంటి టపా ఎప్పుడో ఓ సారి రాయల్సి ఉంటుంది అని తెలుసు కాని, ఇంత త్వరగా రాయాల్సిన అవసరమొస్తుంది అని అనుకో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్ర బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటున్న తరుణం లో ఈ 2009 ఆరంభం లోనే నాకు అత్యంత విషాదాన్ని మిగులుస్తుందనీ నేను అస్సలు ఊహించ లేదు. జనవరి 21 బుధవారం రాత్రి, భోజనం కానిచ్చి మనసు లో "గత మూడు వారాలు గా హాస్పిటల్ లో ఉన్న అమ్మ, గత వారం రోజులు గా ICU నుండి మామూలు రూం కి షిఫ్ట్ అయి నిదానంగా కోలుకుంటుంది, ఇంక ఇవ్వాళో రేపో ఇంటికి పంపించేస్తారు కాబోలు" అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించే సమయం లో తమ్ముడి దగ్గర...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.