అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, ఆగస్టు 08, 2008

ఈ మాసపు పాట :-) నా జన్మ భూమి

ఓ వారం క్రితం వరకూ రోజులో చాలా భాగం బ్లాగులోనే గడిపిన నేను గత వారం రోజులు గా అంతా కలిపి ఒక గంట రెండుగంటలకన్న ఎక్కువ గడిపి ఉండను. ఏదో వెలితిగా వుంది కానీ హటాత్తు గా ఆఫీస్ పని ఎక్కువవడం నా ఇండియా ట్రిప్ దగ్గర పడటం తో ఆ ఏర్పాట్లు... వెరసి బ్లాగ్లోకం లో గడిపే సమయానికి కోత విధించక తప్ప లేదు. నేను ఆగస్ట్ 11 నుండి సెప్టెంబరు 13 వరకు ఇండియా లో ఉంటాను మధ్య లో ఒక 10 రోజులు అక్కడ నుండే పని చేసినా ఇండియా లో ఉంటున్నా కాబట్టి నెల రోజులు శలవు గానే పరిగణించాలేమో. ఇక నేను ఇండియా లో ఉన్న అన్ని రోజులు బ్లాగు రాసే తీరిక ఉండక పోవచ్చు. శలవుల మధ్యలో అప్పుడప్పుడూ వ్యాఖ్యల...

శనివారం, ఆగస్టు 02, 2008

పూవులేవి తేవే చెలీ

అదే సమయం లో వచ్చిన మరో అందమైన లలిత గీతం.. సురస.నెట్ నుండి మనందరికోసం. Poovulevi Teve Che...పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ ||3||తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి ||2||కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ ||2|||| పూవులేవి ||ఆలసించెనా, పూజా వేళ మించిపోయెనా ||2||ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడూ ||2|| || పూవులేవి ||మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే ||2||ఇక పూలే పోయాలి తలబ్రాలల్లే స్వామి పైన ||2|||| పూవులేవి...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.