అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, ఏప్రిల్ 17, 2021

భయపడి జాగ్రత్తపడదాం...

అప్పట్లో ఓ సినిమా కోసం "భయపడడం లోనే పడడం ఉంది మనం భయపడద్దు" అని త్రివిక్రమ్ గారు రాశారు కానీ అది ఆ సందర్భానికి మాత్రమే సూటవుతుంది. అలా అంటే జాగ్రత్తపడడంలో కూడా పడడం ఉందని వదిలేయలేం కదా. అందుకే భయపడి జాగ్రత్తపడదాం డూడ్ దాని వలన పోయేదేం లేక పోగా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సహా ఆరోగ్యంగా ఉంటాం.  కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది పత్రికల భాషలో చెప్పాలంటే కోరలు చాచి ప్రజలపై విరుచుకు పడుతుంది. పరిస్థితి ఆల్రెడీ మన చేతుల్లోనుండి జారిపోయేలా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ జారిపోయింది. ఇపుడు మనం చేయగలిగిందల్లా జాగ్రత్తపడడమే. గత సంవత్సరం...

గురువారం, ఏప్రిల్ 15, 2021

వకీల్ సాబ్ - డైలాగ్స్...

పవన్ కళ్యాణ్ పవర్ పాక్డ్ పెర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ గా నడుస్తున్న తన కొత్త సినిమా వకీల్ సాబ్ ఈ పాటికే అందరూ చూసే ఉంటారు. లేకుంటే కనుక చూసేయండి. ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఇక్కడ చదవవచ్చు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతి కోసం, మహిళల పట్ల దృక్పధాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తూ వారం గడిచింది కనుక స్పాయిలర్స్ అయినా నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఇంకా సినిమా చూడని వారు దయచేసి సినిమా చూసిన తర్వాత చదవగలరు. "రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా...

శనివారం, ఏప్రిల్ 10, 2021

వకీల్ సాబ్...

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. పింక్ మంచి సినిమా అనేది నో డౌట్. టు ది పాయింట్ ఎక్కడా డీవియేట్ అవకుండా అమితాబ్ చక్కని "సపోర్టింగ్" రోల్ తో తాను చెప్పాలనుకున్న సందేశాన్ని సూటిగా ప్రేక్షకుల మనసుల్లో నాటుతారు. ఐతే పింక్ పూర్తిగా మల్టీప్లెక్స్ సినిమా. క్రిటికల్ అప్లాజ్ వచ్చినా, హిట్టయినా ఆ సినిమా ఎంతమంది తెలుగు ప్రేక్షకులు చూశారూ అనేది నాకు సందేహమే. ఒక వేళ చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా...

శుక్రవారం, జనవరి 22, 2021

అమ్మా అమ్మమ్మగారిల్లు...

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. అమ్మమ్మగారిల్లు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కారెంపూడి. మా తాత గారు ఉండేది అందులోని NSP ఇరిగేషన్ కాలనీ లో అది ఊరికి కొంచెం దూరం లో చివరగా కాలవకి కొంచెం దగ్గర గా ఉండేది. కారెంపూడి వరకూ ఉండే బస్సు లు కొన్ని ప్రత్యేకం గా కాలనీ వరకు వెళ్ళేవి, కొన్ని మాత్రం బస్టాండ్ లోనే ఆపేసే వారు. కాలనీకి వెళ్ళే బస్సు లో ప్రయాణం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఊరు సందులు దాటిన తర్వాత రోడ్డుకి...

మంగళవారం, జనవరి 19, 2021

కంబాలపల్లి కథలు - మెయిల్

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న కంబాలపల్లి కథలు వెబ్ సీరీస్ లోని మొదటి అంకం 1:56 నిముషాల నిడివి గల "మెయిల్" బావుంది. అక్కడక్కడా కథా సౌలభ్యం కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ సాధ్యమైనంత సహజమైన వాతావరణంలో సహజ సంభాషణలతో దర్శకుడు ఉదయ్ గుర్రాల చక్కగా తీశాడీ సినిమాని. ఒకప్పుడు గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలంటే ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. అభిరుచి ఉన్న ఏ కొద్దిమందో...

శనివారం, డిసెంబర్ 26, 2020

సోలో బ్రతుకే సో బెటర్...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమాల నుండి మనం ఏం ఆశిస్తామో అవన్నీ ఉన్న సినిమా "సోలో బ్రతుకే సో బెటరు". మిస్సవకుండా చూడాల్సినదో పాత్ బ్రేకింగ్ సిన్మానో కాదు కానీ తొమ్మిది నెలలుగా థియేటర్ లో అడుగుపెట్టని ప్రేక్షకులకి, బిగ్ స్క్రీన్ కోసం మొహం వాచిపోయి ఉన్న సగటు సినీ అభిమానికి ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించి ఇంటికి పంపిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే మనం కాలేజ్ లో...

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

వెళ్ళిరండి బాలూ...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. అసలు పాటంటూ లేని ప్రపంచాన్ని ఊహించగలమా.. ఒక వేళ ఊహిస్తే ఎంత ఖాళీగా చైతన్య రహితంగా నిస్తేజంగా అనిపిస్తుందో కదా. బాలు లేని సినిమా పాట కూడా అంతే అసలు ఊహించలేం, బాలూనే పాట పాటే బాలు. ఒకటా రెండా డెబ్బై నాలుగేళ్ళ వయసు, సుమారు యాబై ఏళ్ళ కెరీర్, పదహారు భాషలు, నలబై వేల పాటలు. ఇప్పటికీ తన గొంతులో అదే ఫ్రెష్ నెస్, పాటంటే పాడటమంటే అదే హుషారు. బాగా పాడాలని అదే తపన. కోవిడ్ లాక్...

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

మణియారయిలె అశోకన్ & c u soon...

ఈ 2020 లో కాస్తో కూస్తో లాభ పడిన వాటిలో మలయాళ సినీ పరిశ్రమ ఒకటి అని చెప్పచ్చేమో. తెలుగు సినిమాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆన్లైన్ అండ్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మలయాళ సినిమాల బాట పట్టారు. దానికి తగ్గట్లే హ్యూమన్ ఎమోషన్స్ కి విలువిస్తూ కథకు పెద్ద పీట వేసి తీస్తున్న ఆ సినిమాలు కూడా బావుంటున్నాయి. ఓటీటీలలో అందుబాటులో ఉంటున్న సబ్ టైటిల్స్ భాష తెలియకపోయినా సులువుగా చూసేయడానికి సహాయపడుతున్నాయ్.    ఈ మలయాళ సినిమాల గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తున్నా కూడా నా బాషాభిమానం అడపాదడపా ఒకటి రెండు తప్ప నన్ను ఆ సినిమాలని ఎక్కువ చూడనివ్వలేదు....

గురువారం, ఆగస్టు 20, 2020

బాలుగారి ఆరోగ్యం కోసం...

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయులని తన సుమధుర గాత్రంతో ఆలరిస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని రోజులుగా కోవిడ్ తో పోరాడుతున్న విషయం అందరకూ తెలిసిందే. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈ రోజు అనగా గురువారం ఆగస్ట్ 20 వ తారీఖున సాయంత్రం ఆరుగంటలకు (ఇండియా టైమ్) ఐదు నిముషాల పాటు బాలుగారు పాడిన పాటలను వింటూ వారి ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని అభిమానులు సంకల్పించారు. ఇందుకోసం #GetWellSoonSPBSIR అనే హాష్ టాగ్ ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాలు ఈనాడు పేపర్ లో ఇక్కడ...

శుక్రవారం, ఆగస్టు 14, 2020

గుంజన్ సక్సేనా...

"కలలు కనండి సాకారం చేసుకోండి" అనే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కు నిలువెత్తు రూపం ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ గుంజన్ సక్సేనా. భారతవాయుసేన తరఫున యుద్దంలో పాల్గొన్న తొలి మహిళా పైలట్ తను. 1999 లో జరిగిన కార్గిల్ యుద్దంలో తన చీతా హెలికాప్టర్ సాయంతో శత్రు స్థావరాలను గుర్తించడం, సైనికులకు ఆహారం, ఆయుధాలను సరఫరా చేయడమే కాక ఎందరో క్షతగాత్రులను యుద్దభూమినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది, ప్రజలు మరియూ డిపార్ట్మెంట్ కార్గిల్ గర్ల్ గా పిలుచుకునే ఆ గుంజన్ కథే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.