అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

వెళ్ళిరండి బాలూ...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link. అసలు పాటంటూ లేని ప్రపంచాన్ని ఊహించగలమా.. ఒక వేళ ఊహిస్తే ఎంత ఖాళీగా చైతన్య రహితంగా నిస్తేజంగా అనిపిస్తుందో కదా. బాలు లేని సినిమా పాట కూడా అంతే అసలు ఊహించలేం, బాలూనే పాట పాటే బాలు. ఒకటా రెండా డెబ్బై నాలుగేళ్ళ వయసు, సుమారు యాబై ఏళ్ళ కెరీర్, పదహారు భాషలు, నలబై వేల పాటలు. ఇప్పటికీ తన గొంతులో అదే ఫ్రెష్ నెస్, పాటంటే పాడటమంటే అదే హుషారు. బాగా పాడాలని అదే తపన. కోవిడ్ లాక్...

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

మణియారయిలె అశోకన్ & c u soon...

ఈ 2020 లో కాస్తో కూస్తో లాభ పడిన వాటిలో మలయాళ సినీ పరిశ్రమ ఒకటి అని చెప్పచ్చేమో. తెలుగు సినిమాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆన్లైన్ అండ్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మలయాళ సినిమాల బాట పట్టారు. దానికి తగ్గట్లే హ్యూమన్ ఎమోషన్స్ కి విలువిస్తూ కథకు పెద్ద పీట వేసి తీస్తున్న ఆ సినిమాలు కూడా బావుంటున్నాయి. ఓటీటీలలో అందుబాటులో ఉంటున్న సబ్ టైటిల్స్ భాష తెలియకపోయినా సులువుగా చూసేయడానికి సహాయపడుతున్నాయ్.    ఈ మలయాళ సినిమాల గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తున్నా కూడా నా బాషాభిమానం అడపాదడపా ఒకటి రెండు తప్ప నన్ను ఆ సినిమాలని ఎక్కువ చూడనివ్వలేదు....

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.