అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జనవరి 22, 2020

అమ్మతో పండగ కబుర్లు...

నేను బాగా చిన్నప్పుడు అంటే రెండు మూడు తరగతుల్లో చదివేటప్పుడు పండగంటే శలవలు రావడం ఎంత కామనో ఆ శలవలకి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళడం కూడా అంతే కామన్. ఊరెళ్ళిన వాళ్ళం తిన్నగా ఉండం కదా.. అప్పట్లో అమ్మమ్మవాళ్ళ ఊరు కారంపుడి ఓ మోస్తరు పల్లెటూరు కిందే లెక్క. నేను ఉంటున్న చదువుకుంటున్న నరసరావు పేట దానితో పోలిస్తే ఓ మోస్తరు పట్నం అనమాట. అదీ కాక ఇంటికి పెద్దమనవడ్ని అప్పటికి ఒకే ఒక మనవడ్ని కావడంతో నన్ను అందరూ అపురూపంగా చూస్కునే వాళ్ళు.  అమ్మ గురించైతే ఇక చెప్పనే అక్కర్లేదు. చెప్పులో స్లిప్పర్సో లేకుండా నన్ను ఇల్లు దాటనిచ్చేది కాదు. కానీ నాకేమో అవసలు వేస్కోవాలన్న...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.