అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, అక్టోబర్ 01, 2019

నానీ’స్ గ్యాంగ్ లీడర్...

వరలక్ష్మి (శరణ్య) ప్రపంచంలో అందరి ఆకలి తన పులిహోరతో తీర్చేయచ్చని నమ్మే ఓ అమాయకపు అమ్మ. ఏడాది క్రితమే చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయి ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది. ప్రియ (ప్రియాంక అరుల్ మోహన్) చదువుకుని ఉద్యోగం చేస్తున్న తెలివైన అమ్మాయి. తనకి ఎంగేజ్మెంట్ అయి పెళ్ళి చేస్కోవాల్సిన అబ్బాయి ఏడాదిక్రితమే దూరమైనా మర్చిపోలేకా ముందుకు వెళ్ళలేకా ఆలోచనలతో సతమతమయ్యే అమ్మాయి. స్వాతి (శ్రియ రెడ్డి) అన్న చాటు చెల్లెలు, ఉన్న ఒక్క అన్నయ్య ఏడాది క్రితమే చనిపోయాడు. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అన్నయ్య ఫోన్ కు మెసేజ్ చేస్తూ తనని ఊహలలో బతికించుకుంటూ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.