అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, జనవరి 22, 2019

అమ్మ ప్రేమ...

అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చేవట నా చిన్నప్పుడు. అలాంటి వాటిలో ముఖ్యమైనది బలం లేకపోవడమట. అసలు ఆహారంపై శ్రద్ద లేకపోవడం. ఏం పెట్టినా తినకపోవడం, ఎన్ని తంటాలు పడి ఎంత తినిపించినా బొత్తిగా బలం...

సోమవారం, జనవరి 14, 2019

NTR - కథానాయకుడు...

కథానాయకుడు సినిమా గురించి చాలామందికి ఉన్న సందేహాలన్నీ పక్కనపెట్టవచ్చు. కొందరు అంటున్న మహానటితో పోలికలు, తారక్ లేడు, బాలకృష్ణ యంగ్ గేటప్ బాలేదు, ఎలక్షన్లముందు రిలీజవాలని హడావిడిగా చుట్టేశారు లాంటి మాటలన్నీ మర్చిపోవచ్చు. ఆ హడావిడి ఎక్కడో కొన్నివిషయాల్లో కనిపించినప్పటికీ అతి తక్కువ టైమ్ లో క్వాలిటీ ప్రోడక్ట్ ను అందించారు క్రిష్ అండ్ టీం. అయినా ఈ ఇంటర్నెట్ యుగంలో ఒక సినిమా చూసి ఓటు వేసేవాళ్ళు ఎవరుంటారండీ, కనుక ఇవన్నీ వదిలేసి...   కొన్ని దశాబ్దాల పాటు వెండితెరని ఏలిన మకుటం లేని మహారాజు గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా చూడండి. ఒక...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.