అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జులై 29, 2015

భారత రత్నానికి నివాళి..

Sand sculptor Sudarshan Patnaik pays tribute to the People's President through this unique sand art మరణం అనివార్యమని తెలిసినా ఆత్మీయులనో ఆత్మ బంధువులనో కోల్పోయినపుడు మనసు బాధపడక మానదు. అదీ కలాం గారి లాంటి మహోన్నతమైన మనిషి దూరమైతే మిన్ను విరిగి మీద పడినంతగా చలించి పోవడం సహజమే. కానీ ఈ సమయంలో ఆయన మరణాన్ని చూసి కన్నీరు కార్చవద్దు ఆయన మహోన్నతమైన జీవితాన్ని చూసి గర్వపడదాం.. స్ఫూర్తి పొందుదాం.. దదాపు గత మూడు దశాబ్దాలుగా (బహుశా ఇస్రో/డీఅర్డీఓ గురించి తెలిసిన వారికి అంతకు ముందు నుండే) ఈ దేశంలోని ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా విధ్యార్ధులలో యువతలో ఆ మహానుభావుడు...

గురువారం, జులై 16, 2015

బాహుబలి - ది బిగినింగ్...

ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్స్ లో తక్కువ వచ్చిన రివ్యూ రేటింగ్స్ అండ్ వాటిలో రివ్యూవర్స్ కామెంట్స్ చూసి నిరుత్సాహ పడి సినిమా చూడడం మానేసిన వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఈ సినిమా చూడకపోవడం వలన మీరో అద్భుతమైన అనుభవాన్ని మిస్ అవుతున్నారు. చిన్నతనంలో చందమామ లాంటి పుస్తకాలలో చదువుకున్న అందమైన కథలను కనుల ముందు సాక్షత్కరింప జేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. నేను కొన్ని హాలీఉడ్ వార్ ఎపిక్ చిత్రాలు ఇదివరకే చూసినా వాటిలో ఏదో తెలియని లోటు కనిపించేది నాకు ఒక విధమైన అసహజత్వం కనిపించేది, ఆ మనుషులు, కాస్ట్యూమ్స్, గెటప్స్, స్వరాలు, భాష ఒకదానితో ఒకటి...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.