అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు

కొన్నిసినిమాలు పెద్దగా హడావిడి లేకుండా నిశ్శబ్దంగా విడుదలవుతాయి కానీ ప్రేక్షకుల మనసులో అలజడులను రేపి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి అరుదైన సినిమానే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. నిజానికి ఈపేరుతో సినిమా మొదలుపెడుతున్నారన్నపుడు అబ్బా మంచి పాటల్లో లైన్స్ ఇలా వాడి పిచ్చి సినిమాలు తీసి చెడగొడతారెందుకో అని అనుకున్నాను. కానీ సినిమా చూశాక ఆ పాట ఎంత ఇష్టమో సినిమా మీద అంతకు పది రెట్లు ఇష్టమ్ పెరిగింది. ప్రతివారం సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి అందులో సగానికి పైగా ప్రేమకథలే ఉంటూంటాయి కాని ఇలాంటి ప్రేమకథలు మాత్రం అరుదుగా వస్తాయి. అమ్మ(పవిత్ర...

శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015

మా టీవీలో ఓనమాలు on 7th Feb 8PM

మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని ప్రోత్సహించడం అటువంటి చిత్రాలని అభిమానించే వారు తప్పక చేయవలసిన పని. ఇంచుమించు రెండేళ్ళ క్రితం "క్రాంతిమాధవ్" దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని చిత్రం "ఓనమాలు". ఈ చిత్రానికి ఖదీర్ బాబు రాసిన పదునైన సంభాషణలు ఆకట్టుకుంటూనే ఆలోచింప చేస్తాయి. ఇంత చక్కని సినిమాను మాటీవీ వారు ఈ శనివారం ఫిబ్రవరి 7 న రాత్రి 8 గంటలకు మొదటిసారి ప్రసారం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైనపుడు చూడడం కుదరని వారు ఈ సదవకాశాన్ని వదులుకోకుండా తప్పక చూడండి. ఈ చిత్రం పై అప్పట్లో నేను రాసిన రివ్యూ ఇక్కడ చదవచ్చు.   ఈ చిత్ర దర్శకుడు...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.