అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

గురువారం, జనవరి 22, 2015

అమ్మా అమ్మా..

కాలం ఎంతటి బాధనైనా మరిపిస్తుందని అందరూ అంటూ ఉంటారు కానీ అది కొంతమేరకే నిజం. అంతకంతకూ పెరిగే మధ్యాహ్నపు నీడలా కాలం గడిచే కొద్దీ బాధ కూడా పెరుగుతుంది... అమ్మ మాకు దూరమై నేటికి ఆరేళ్ళు గడిచినా ఆ దిగులు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు సరికదా తను దూరమైనప్పటి కన్నా తను వదిలి వెళ్ళిన శూన్యం ప్రశ్నిస్తూ తను లేని లోటు అనుక్షణం గుర్తొస్తూ ఉండేకొద్దీ ఆ బాధ మరింత పెరుగుతూనే ఉంది తప్ప తరగడంలేదు. తన అడుగు జాడల్లో నడవాలని ప్రయత్నిస్తూ తను అపురూపంగా నిర్మించిన పొదరింటిని పదిలంగా కాపాడుకుంటూ తన జ్ఞాపకాల ఊతంతో ఎలాగో కాలం గడుపుతున్నాను.  ఇటీవల విడుదలైన రఘువరన్...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.