అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, నవంబర్ 26, 2014

రౌడీఫెలో...

నారా రోహిత్ నాకు నచ్చే నటులలో ఒకరు. తెలుగులో ఇతర కమర్షియల్ హీరోలకి భిన్నంగా తనకంటూ ఒక పంథా సృష్టించుకోవాలని తపనపడే ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మొదటి చిత్రం 'బాణం' లోనే తన ప్లస్ పాయింట్స్ ని సరిగా క్యాచ్ చేసి వాటిని హైలైట్ చేసే కథతో వచ్చి మంచి మార్కులేయించుకున్నాడు. తరువాత ఒక లవ్ స్టోరీ (సోలో), ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా(ఒక్కడినే), ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ (ప్రతినిధి) ఇలా ఏం చేసినా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇచ్చే ప్రామిసింగ్ హీరో అనిపిస్తాడు నాకు. కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా కానీ ఇతని సినిమాలు ఖచ్చితంగా వైవిధ్యంగా తప్పక ఒకసారైనా చూడాలనిపించేలా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.