అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, మే 07, 2014

ఎన్నికల కబుర్లు..

ఆదివారం కాకపోయినా ఆ రోజు అందరికీ సెలవు ఉండేది... సెలవు అయినాకానీ నాన్న మాత్రం ఇంట్లో ఉండేవారు కాదు.. ఒకరోజు ముందుగానే ప్రయాణమయి ఎక్కడో దూరంగా ఉండే ఊరికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళేవారు... నాన్న వెళ్ళిన దగ్గర నుండీ అమ్మ రేడియో, టీవీ అన్నీ ఎదురుగా పెట్టుకుని వింటూ చూస్తూ నాన్న డ్యూటీకి వెళ్ళిన ఊరిలో ఏ గొడవలూ రాకూడదని అందరు దేవుళ్ళకీ మొక్కులు మొక్కుకుంటూ గడిపేది... తెల్లారి ఎన్నికల రోజు పది పదకొండు గంటల సమయంలో వంట పనులన్నీ అయ్యాక పార్టీ కార్యకర్తలు అరేంజ్ చేసిన వాహనాల్లో అమ్మ ఇంకా పక్కింటి ఆంటీలందరూ వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఓటుహక్కులేని...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.