అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, అక్టోబర్ 29, 2012

శుభసంకల్పం-ఈనాడు కథ

నిన్న(అక్టోబర్-28-2012) ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన సి.ఎన్.చంద్రశేఖర్ గారి “శుభ సంకల్పం” కథ నాకు నచ్చింది. కథనం, శిల్పం, అలంకారం వగైరాలు నాకు తెలియవు కనుక వాటి గురించి నేను వ్యాఖ్యానించే సాహసం చేయలేను. ఒక సామాన్య పాఠకుడిగా చదివినపుడు కథలో ఇన్వాల్వ్ అయి చదివగలిగాను, ముఖ్యంగా కథలో చెప్పాలనుకున్న విషయం నన్ను ఆకట్టుకుంది. ఈకాలం కుర్రకారుకి కొంచెం ప్రీచింగ్ స్టోరీలాగా అనిపించవచ్చు కానీ కొన్ని పనులు చేసేముందు నిర్ణయాలు తీసుకునేముందు దుందుడుకుగా కాక జాగ్రత్తగా ఆలోచించి చేయమని చెప్పడం...

బుధవారం, అక్టోబర్ 17, 2012

బ్రదర్స్-లెంత్ తో బెదుర్స్

ఏదైనా ఒక సినిమా మనకి విపరీతంగా నచ్చడం ఆ సినిమా దర్శకుడికి హీరోకి ఒక రకంగా శాపమనే చెప్పచ్చు. “రంగం” లాంటి సినిమా తీసిన దర్శకుడు కె.వి.ఆనంద్ నుండి ఎప్పుడు అంతటి ప్రత్యేకత ఉన్న సినిమాలు, ప్రతి సినిమాకి అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేనే ఆశించడం మన తప్పేనని నిరూపిస్తూ మనల్ని పూర్తిగా నిరాశ పరిచే సినిమా అతని కొత్త సినిమా ’బ్రదర్స్’....

మంగళవారం, అక్టోబర్ 16, 2012

RGV 3D బూచి !!

“కొన్ని లక్షల ఇళ్ళలో కొన్ని ఇళ్ళను మాత్రమే కొందరు ఇష్టపడతారు, ఎందుకో తెలియదు కానీ షబ్బూ కూడా ఈ ఇంటిని అలాగే ఇష్టపడింది. చాలారోజులుగా ఈ ఇంట్లోనే ఉంటుంది.” అన్న వర్మ వాయిస్ ఓవర్ తో ఓ ఇంటిని క్లోజప్ లో చూపిస్తూ ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కట్ చేస్తే ఆ ఇంటిలో ఉంటున్నవాళ్ళు మూడు నెలలు గా అద్దె ఇవ్వకుండా ఫోన్ కు కూడా సమాధానమివ్వకుండా ఏమయ్యారో తెలీదు. ఈ విషయం ఓనర్ ద్వారా విని తలుపులు బద్దలు కొట్టిచూసిన రెంటల్ ఏజెంట్ కు ఇంట్లో ఎవరూ కనిపించకపోవడం...

సోమవారం, అక్టోబర్ 08, 2012

అవును !!!

కామం ప్రధానాంశంగా కల చిత్రాలను ఎంత బాగా తెరకెక్కించినా ఆస్వాదించడంలో ఎప్పుడూ ఓ చిన్న ఇబ్బంది ఉంటునే ఉంటుంది. ఆ ఇబ్బందే అరుంధతిలాంటి సినిమాలను సైతం మనల్ని ఎంకరేజ్ చేయనివ్వదు. ఈ సినిమాలోని ప్రధానాంశం కూడా అదే కనుక కుటుంబంతో చూడడానికి ఇబ్బంది పడచ్చు, పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలను ఈ సినిమానుండి దూరంగా ఉంచడమే బెటర్. సబ్జెక్ట్ పై ఎంత అయిష్టత ఉన్నా ఇలాంటి వ్యక్తులకు సమాజంలో కొదవలేదు కనుక ఆ విషయాన్ని అంగీకరించి సినిమా చూస్తే 45లక్షల లోబడ్జెట్ తో క్వాలిటీ చిత్రం తీసినందుకుగానూ, టేకింగ్ విషయమై మంచిప్రయత్నంగా దర్శకుడిని అభినందించవచ్చ...

ఆదివారం, అక్టోబర్ 07, 2012

ENగ్LISH VINGLIష్

ఈ సినిమా చూసినంతసేపు నవ్వుకున్నా, అక్కడక్కడ గుండె బరువెక్కినా, పూర్తయ్యాక తేలికైన మనసుతో, మంచి సినిమా చూశానన్న సంతోషంతో బయటకు వచ్చినా, ఇంటికి వచ్చాక మాత్రం ఈ సినిమా నన్ను చాలాసేపే ఆలోచనలలోకి నెట్టేసింది. రోజంతా తీరికలేకుండా శుచీ శుభ్రమని ఆలోచించకుండా వారాంతాలూ శలవలూ లేని ఇంటెడు చాకిరీని నవ్వుతూ చేసేస్తూ మనం అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మని మనమెంత అలుసుగా చూస్తామోకదా. బహుశా మనం అలా చేయడానికి ఒక కారణం తనని అలాగే ట్రీట్ చేసే నాన్నకావచ్చు కొన్నిసార్లు నాదేముందిలేరా అని తనగురించి అస్సలు పట్టించుకోని అమ్మకూ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.