అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, ఏప్రిల్ 23, 2012

దేవస్థానం సినిమా గురించి

శ్రీమన్నారాయణ(కె.విశ్వనాథ్) గారికి దేవస్థానమే ఇల్లు, జీవిత చరమాంకంలో ఎవరూతోడులేని ఆయన ఎక్కువ సమయం దైవసన్నిధిలోనే గడుపుతూ ఉంటారు, సాగరమల్లే తొణకని నిండైన వ్యక్తిత్వం, పురాణాలపై ఆధ్యాత్మిక విషయాలపై పట్టు, భారతీయ కళల పట్ల మక్కువ ఆయన సొంతం. సాంబమూర్తి(బాలసుబ్రహ్మణ్యం)కి ఇల్లే దేవస్థానం పెళ్ళై ఇరవైఏళ్ళైనా పిల్లలులేక భార్యలోనే కూతురును కూడా చూసుకుంటూ ఇల్లూ తానుపనిచేసే షాపు తప్ప మరో లోకం తెలియకుండా చంటిపిల్లాడిలా సరదాగా చలాకీగా ఉండే మనిషి. సాంబమూర్తి భార్య(ఆమని) భర్తని ప్రేమగా చూసుకుంటూ ఆయనకు అన్నివిధాలుగా చేదోడువాదోడుగా నిలిచే అనుకూలవతి అయిన...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.