అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, సెప్టెంబర్ 11, 2010

పండుగల శుభాకాంక్షలు

మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్యఐశ్వర్యాలతో సదాకాపాడుగాక. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో ఊరంతా పండుగ వాతావరణం, ఎక్కడచూసినా కొత్తబట్టల రెపరెపలు బంధుమిత్రుల కోలాహలం చూడటానికి కనులకింపుగా చాలా బాగుంది. ఇదివరకు పండుగ రోజు బయటకి వెళ్తే కొన్ని వీధులు కళకళలాడుతూ కొన్ని వెలవెల బోతూ కనిపించేవి కానీ ఈ రోజు చాలా చోట్ల సందడే. ఈ రెండు పండుగలతోనూ నెలవంక ముడిపడి ఉండటం ఇంకో విశేషం, కాకపోతే ఒకరు నెలవంకని చూడద్దంటే ఇంకొకరు చూశాకే పండుగ చేసుకొమ్మంటారు అది వేరే విషయం అనుకోండి. పోయినేడు అనుకుంటాను...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.