అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, ఫిబ్రవరి 20, 2010

ఈ నాడు ’ఈనాడు’ లో నేను.

  ఈనాడు వెబ్ పత్రిక మనసులోమాట బ్లాగర్ సుజాత గారికి కృతజ్ఞతలత...

మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

హాస్టల్ - 2

ఇలా బోలెడు ప్రశ్నలతో నాన్న వెనక నడుస్తూ ఆ చిన్న గేట్ ద్వారా లోపలికి అడుగుపెట్టాం. రిజిస్టర్ లో నాన్న ఏవో వివరాలు నింపిన తర్వాత ఆఫీస్ రూమ్ కి ఎలా వెళ్ళాలో దారి చూపించారు. మెల్లగా ముందుకు నడవడం ప్రారంభించాం. గేటు ఆనుకుని పక్కనే ఒక చిన్న బిల్డింగ్ దానిలో క్యాంటిన్ లాగా ఉంది అక్కడ కాఫీ,టీ,కూల్ డ్రింక్స్, కేకులు, బిస్కట్లు, సబ్బులు, పేస్ట్ లు, షాంపూలు ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ దొరుకుతాయిట. కేకులు బిస్కట్లు కూల్ డ్రింక్ లు చూసాక ఓకే ఇది కొంత వరకూ పర్లేదు, హమ్మయ్య కనీసం ఒక సమస్య తీరింది అనుకున్నాను. అవునూ బయట స్కూల్ బోర్డ్ ఉంది కానీ కాలేజ్ పేరు లేదేంటి...

సోమవారం, ఫిబ్రవరి 15, 2010

హాస్టల్ - 1

నల్లగా నిగనిగలాడుతూ, మెలికలు తిరుగుతూ పరుచుకుని ఉన్న తారు రోడ్ పై బస్సు శర వేగంతో ముందుకు వెళ్తుంది. నరసరావుపేట పొలిమేరలు దాటి ఐదునిముషాలవుతుందేమో. కిటికీ పక్కనే కూర్చున్న నా దృష్టి రోడ్ పైనే ఉన్నా ఆలోచనలు మాత్రం బస్సుకన్నా వేగంగా, దారితప్పిన బాటసారిలా ముందుకు వెనక్కు ప్రయాణిస్తూ ఉన్నాయ్. "విజయవాడ ఎంత సేపట్లో వస్తుంది నాన్నా?" ప్రశ్న అడుగుతూ పక్కకి తిరిగిన నాకు, కొద్దిగా తెరిచిన నోటినుండి సన్నగా వస్తున్న గురకే సమాధానమైంది. పాపం నాన్న, ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం వరకూ పని చేసి వచ్చి హడావిడిగా అన్నంతినేసి నన్ను హాస్టల్ లో దిగబెట్టడం కోసం,...

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2010

నేనూ .. బ్రిటానియా ..

అసలు చిరుతిళ్ళనూ, చాక్లెట్లు బిస్కెట్లు లాటి తినుబండారాలనూ ఇష్టపడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారేమో. అందుకే 1892 లో 295 రూపాయల పెట్టుబడితో కలకత్తాలో ఒక మూల ప్రారంభమైన ఒక చిన్న బిస్కట్ కంపెనీ నేడు వందకోట్ల టర్నోవర్ దాటడమే కాక ప్రపంచంలోని మొదటి రెండువందల చిన్న కంపెనీలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఇండియాలో నమ్మదగిన బ్రాండ్ల లో రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అయితే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడం ఒకటే కాక. ఎప్పటికప్పుడు వినూత్నమైన మార్కెటింగ్ పద్దతులతో మారుతున్న ప్రజల అభిరుచులకు తగిన విధంగా మార్పులు చేర్పులతో...

శుక్రవారం, ఫిబ్రవరి 05, 2010

Happy to Help - ఛా! నిజమా!!

ఈ వీడియో చూశారా అందులో మొదటి ప్రకటన చూసి "how cute!!" అని అనుకోని వారు ఉండరేమో కదా. చక్కని క్రియేటివిటీతో ఎంతో శ్రద్దగా తయారు చేసిన ప్రకటన. నాకు నచ్చిన వాణిజ్య ప్రకటనల్లో ఇది ఒకటి. హచ్ కుక్క పిల్ల ’పగ్’ సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు కదా... దానినే ఉపయోగించి వోడాఫోన్ కు ఈ ప్రకటన రూపొందించిన వారెవరో కానీ వారిని మెచ్చుకోకుండా ఉండలేను. దీని తర్వాత ఇప్పుడు తనకు తానుగా ఏ ఫేమస్ హీరోకూ తీసిపోనంత పేరు సంపాదించుకున్న zozo పాత్రలతో రూపొందించిన వోడాఫోన్ ప్రతి ప్రకటనా ఆ యాడ్ మేకర్  క్రియేటివిటీ కి అద్దం పడుతుంది. నేను గత మేలో ఇండియా వచ్చినపుడు ఏ ఫోన్...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.