అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

గురువారం, ఫిబ్రవరి 19, 2009

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా !!

ఈ పాట గురించి ఏమని చెప్పను. ఘంటసాల గారి గాత్రం తో మనసు ను మెలి పెట్టే పాట. ఆత్మీయులను కోల్పోయినపుడు గుర్తొచ్చి మరింత భాధ పెట్టే పాట. ఆపద్బాన్ధవుడు లో అడిగినట్లు "ఆ దేవుడి కి తను చేసుకున్న బొమ్మ ల పై తనకు హక్కు లేదా" అని అడుగుతున్నారా ?, మరి అలా తన ఇష్టమొచ్చినట్లు ఆడు కుందామని అనుకున్నపుడు ఆ బొమ్మల మధ్య అనుభంధాలు, మమతానురాగాలు ఎందుకు సృష్టించాలి ? ఏంటో ఈ దేవుడు !! అందుకే ఒకటి మాత్రం నిజం... తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!ఈ పాట ఇక్కడ చిమట మ్యూజిక్ లో వినండిచిత్రం: దేవత (1965)సంగీతం : యస్.పి. కోదండపాణిసాహిత్యం : శ్రీశ్రీగానం : ఘంటసాలబ్రతుకంత...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.