అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, నవంబర్ 26, 2008

చలి -- పులి

శీర్షిక చూసిన వెంటనే తెలుగు పేపర్ చదివే అలవాటున్న వారికి వాతావరణం ఉష్ణోగ్రతలు కాలమ్ గుర్తుకు వచ్చి ఉంటుంది కదా. పేపర్ వాళ్ళు ఈ Temperatures column heading ని ఆయా కాలాలకి (Seasonal) అణుగుణం గా భలే మారుస్తుంటారు. చలికాలం చలి పులి అని పెట్టి పక్కనే వణుకుతున్న కిరణాలతో సూరీడి బొమ్మ వేస్తారు :-) అలానే ఇక సమ్మర్ లో ఎండాకాలం.. మండే ఎండలు.. ఈ తరహా శీర్షిక లు మామూలే... సరే ఇదంతా ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఇక్కడ చలి కాలం మొదలై పోయింది అంటే ఇది ఇంకా మొదలే అనుకోండి ఇంకా ముందుంది అసలైన తధిగిణతోం కానీ నిన్న మొన్నటి వరకు సమ్మర్ మరియూ స్ప్రింగ్ వాతావరణం...

మంగళవారం, నవంబర్ 25, 2008

కార్పొరేట్ ట్రావెల్ !!!

నాకు సాధారణం గా లంచ్ నా డెస్క్ దగ్గరకే తెచ్చుకుని ఇంటర్నెట్ లో వార్తలో, వికీ నో, మరోటో చూస్తూ తినడం అలవాటు. మొన్న గురువారం అలాగే లంచ్ టైం లో CNN news చదువుతుంటే ఈ వార్త నన్నాకర్షించింది. దాని గురించే ఈ టపా….మీ ఊహా శక్తి కి కొంచెం పని కల్పించి ఒక చిన్న దృశ్యం ఊహించుకోండి. మీరో గంపెడు పిల్లలు బోలెడు జనాభా మరియూ భాధ్యతలతో నిండి ఉన్న ఒక ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయి ఉండి నెలాఖరు రోజులలో కడుపు నిండా తింటానికి కూడా డబ్బులు లేని పరిస్తితులలో కష్ట పడి పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుని అరుగు మీద సేద దీరుతుంటే మీ ముందు ఒక ఖరీదైన బెంజ్ కార్ వచ్చి ఆగి అందులో...

ఆదివారం, నవంబర్ 16, 2008

ఓ క్లాసు... ఓ మాసు... :-)

గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి.... 05.Neelalu Kareena...చిత్రం : ముద్దమందారంసాహిత్యం : వేటూరిసంగీతం...

మంగళవారం, నవంబర్ 11, 2008

Potluck !! మన వన భోజనాలేనండీ...

మా టీం లో మూడొంతుల పైగా భారతీయులు ఉండటం తో మొన్నీమధ్య దీపావళి సంధర్భం గా మా ఆఫీస్ లో పాట్ లక్ అరేంజ్ చేసాము సరదాగా ఆ ఫోటోలు దాని ప్రిపరేషన్ కోసం నే పడ్డ పాట్లు మీతో పంచుకుందామని ఈ టపా...అమెరికా జీవన విధానం గురించి పెద్ద గా పరిచయం లేని వారికోసం అసలు potluck అంటే ఏంటో ముందు చూద్దాం. నేను అమెరికా వచ్చిన కొత్త లో అందరితో కలిసి పాట్‌లాక్ (potlock) అని అనే వాడ్ని తర్వాత తర్వాత మెల్ల గా అది pot lock కాదు potluck అని తెలుసుకున్నాను. దీని డిక్షనరీ మీనింగ్ ఏమిటా అని వెతికితే అనుకోని అతిధి కి కుండలో ఉన్నదేదో వడ్డించడం అని ఒక అర్ధం అట అంటే నిఖార్సైన తర్జుమా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.