అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, సెప్టెంబర్ 29, 2008

ఫిల్టర్ కాఫీ / కాఫీ ఫిల్టర్

శీర్షిక చూసి ఇదేదో మంచి కాఫీ లాంటి టపా చదువుదాం అని వస్తే, మీరు తప్పులో కాలేసినట్లే ముందే హెచ్చరిస్తున్నా కాబట్టి చదివి మీరు తెచ్చుకునే తలనొప్పులకు ఇక నా పూచీ ఏం లేదు (నా లాంటి కాఫీ ప్రియులకి తలనొప్పి కూడా ఒకందుకు మంచిదే!! మరి ఎంచక్కా ఆ వంకతో ఇంకో కప్పు కాఫీ ఎక్కువ తాగేయచ్చు కదా:-). సరే ఏదో ఊసు పోక ఈ రోజు ఉదయం నే చేసిన సాహసం గురించి సరదాగా వ్రాద్దాం అని కూర్చున్నా సో తీరిక ఉంటే చదవండి.నేను ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాను కానీ చాలా బిజీ స్కెడ్యూల్ అవడం వల్ల శరవణ భవన్ లో ఫిల్టర్ కాఫీ తాగే అవకాశం దొరక లేదు. కానీ అక్కడ ఉన్నంత సేపూ తలచుకుంటూనే...

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

బ్లాగ్లోకానికి, బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి...

బ్లాగ్లోకానికి బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి... గత నెల రోజులు గా నా నుండి కొత్త టపా లేక పోయినా అపుడపుడు ఇటు విచ్చేసి వ్యాఖ్య లతో పలకరించి ప్రోత్సహంచిన మిత్రులందరికీ శతకోటి నమస్సులు. నేను మధ్యలో ఒకటీ అరా టపా లు అతికష్టం మీద చదివినా వ్యాఖ్య వ్రాసే సమయం లేకపోయింది. కంప్యూటరు తో గడప గలిగిన కాస్త సమయం లో ఏదో ఒక ఆఫీసు పని ఉండటం తో పాటు Internent Speed సరిగా లేక పోడం తో ఎక్కువ సమయం వెచ్చించ లేకపోయాను.ఏదేమైనా నెల రోజుల శలవులు ముగించుకుని ఈ రోజే తిరిగి చికాగో చేరుకున్నాను. నేను డిల్లీ నుండి బయలుదేరే రోజే అక్కడ పేలుళ్ళు జరగడం బాధాకరం, Aug 11th ఉదయం అభినవ్...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.