అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, ఆగస్టు 28, 2013

మిస్సవకూడని 2 సినిమాలు

అంతకుముందు ఆ తరువాత :  గ్రహణం, మాయాబజార్, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్. ఇపుడు ఈ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి అభిరుచిగల తెలుగు దర్శకులలో ఒకరు. తీసుకున్నది రొటీన్ సబ్జెక్ట్ (ప్రేమ, లివ్ఇన్ రిలేషన్ షిప్) అయినా కూడా దానిని తెరకెక్కించడంలో తెలుగుదనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా తెలుగు కుటుంబాలు ఎదుర్కొనే సాధారణ సమస్యలను డిస్కస్ చేస్తూ మంచి మంచి సంభాషణలతో చక్కని కారెక్టరైజేషన్స్ తో వాటికి తగిన నటీనటులతో రొటీన్ కి భిన్నంగా సహజంగా కనిపించేలా తీర్చిదిద్దినందుకు ప్రోత్సహించడానికైనా ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలి. కళ్యాణి కోడూరి...

ఆదివారం, ఆగస్టు 18, 2013

చీమలు దోమలు ఈగలు - చిట్కాలు

ఈ రోజు నేను మీకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు/హోం రెమెడిస్ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కొందరు పెద్దలు, మరి కొందరు ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుని నేను ప్రయత్నించి ఫలితం చూసినవి. చీమలు : ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేక బండలమధ్యో కొంత ప్లేస్ చేస్కుని చీమలు మనమీద దండయాత్ర చేసేవి అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సినో ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ మామూలు ఇళ్ళలోకూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో...

ఆదివారం, ఆగస్టు 04, 2013

ఓ ప్రయాణం

సమైఖ్యాంద్రా గొడవలూ, బంద్ ల వలన మూడురోజులుగా వాయిదా వేస్కుంటూ వస్తున్న తెనాలి ప్రయాణానికి  నిన్నటి రోజున ముహుర్తం పెట్టాను. కాస్త చల్లబడబోయే గొడవలకి మొన్న కే.సి.ఆర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లై మళ్ళీ నిన్న పొద్దున్న కాస్త హడావిడి ఎదురైంది. వాళ్ళని తప్పించుకుని ఎలాగైతేనేం గుంటూరు బస్టాండ్ చేరుకుని తెనాలికి నాన్ స్టాప్ టికెట్ తీస్కుని డీలక్స్ బస్సెక్కాను, బస్ కాస్త ఖాళీగానే ఉందికానీ ఉన్న కొందరూ విండో సీట్స్ ఆక్రమించుకునేసరికి నిండుగానే ఉన్నట్లు కనిపించింది.  ఖాళీగా ఉన్న ఒక సీట్ కాస్త మురికిగా ఉందనిపించి ఒకసారి చేత్తో...

గురువారం, ఆగస్టు 01, 2013

దొంగా - పోలీసూ - ఓ కోర్టు.

6th April-2013: సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది. ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.