అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, మే 21, 2013

మణిప్రవాళం - తిలక్

తిలక్ గారు 1963 వ సంవత్సరంలో రాసిన కథ మణిప్రవాళం. కథల సంకలనంలో ఈ కథ చివరలో స్వాతి, 1963 అని రాశారు కానీ ఇప్పటి స్వాతి ప్రారంభమైనది 1970 లో కనుక అప్పటి స్వాతి వేరైనా అయిఉండాలి లేదా పత్రిక పేరో/సంవత్సరమో పొరపాటుగా అచ్చయి ఉండాలి, ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పగలరు.  మణిప్రవాళము అంటే రెండు భాషలు కలగలిసిన కవిత్వమట. సంస్కృత శబ్దాలకు సరిపోలగల మళయాళ అక్షరములు లేక మొదట్లో వైష్ణవాచార్యులు కొన్ని మాటలు గ్రాంధీకంలోనే రాసి ఇటువంటి శైలి ఉపయోగించారని, అలా కలగలసిపోగల పదాలను గుర్తించి నిర్ధుష్టమైన నియమావళిని ఏర్పాటు చేశారనీ. ఆ తర్వాత అదే కవిత్వ...

శనివారం, మే 18, 2013

కవుల రైలు - తిలక్

తిలక్ గారు ఈ కథని ఎపుడు రాశారో తెలియదు కానీ ఇప్పటికీ ఎప్పటికీ అన్వయించుకోవచ్చునేమో. ఒక్క కవిత్వానికేనా? రచనలకీ, సినిమాలకీ, ఆ మాటకొస్తే అసలును వదిలేసి గమ్యం తెలియని ప్రయాణం చేసే ఎన్నో రంగాలలోని ఎంతో మందికి నిస్సంకోచంగా అన్వయించుకోవచ్చు. ఈ చిన్న కథ చదవగానే నచ్చి బ్లాగ్ లో మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా...   ~*~*~   తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.