అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, డిసెంబర్ 03, 2012

కృష్ణం వందే జగద్గురుం

ఒక నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సురభి నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసి తన ఇంటి పేరుగా మార్చుకున్న సురభి సుబ్రహ్మణ్యం(కోటా శ్రీనివాసరావు) గారి మనవడై ఉండి కూడా ఆయన సిద్దాంతాలని ఏమాత్రం లెక్కచేయకుండా కళారంగం తిండిపెట్టదనీ, మోసం చేసైనాసరే తను అమెరికా వెళ్ళి స్థిరపడితే చాలనీ, ఎవడి బతుకు వాడు బతకాలని నమ్మే బి.టెక్.బాబు(రాణా) తన అభిప్రాయం తప్పనీ, మనిషి సంఘజీవి అనీ, తోటి మనిషికి సాయం చేయడమే దైవత్వమనీ, భగవంతుడి దశావతారాల సారం ఇదేననీ స్వానుభవంతో తెలుసుకుని మైనింగ్ మాఫియా గుప్పిట చిక్కుకున్న ఒక ప్రాంతానికి ఎలా సాయం చేశాడో తెలియజెప్పే కథే “కృష్ణం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.