అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, జులై 30, 2012

ఓనమాలు

చదువుకోసమైతేనేం ఉద్యోగరీత్యా అయితేనేం ఇంటికి దూరంగా చాలా ఏళ్ళపాటు ఊళ్ళుపట్టుకు తిరిగడంవల్ల దేశంలోని వివిధప్రాంతాల వంటలేకాక విదేశీ వంటకాలను సైతం ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ లో రుచిచూడగలిగే అవకాశం నాకు బాగానే దొరికింది. ఆ రుచులను అప్పటికప్పుడు ఆస్వాదించినా కూడా ఏదోతెలియని లోటు, ఒక అసంతృప్తి అలా మిగిలిపోయేది. ఎప్పుడో అవకాశం దొరికి ఇంటికి వచ్చినపుడు అమ్మచేతి వంట తింటే మాత్రం అంతులేని సంతృప్తి కలిగేది. అమ్మచేతి వంటకు ఆకర్షించే అలంకరణలుండవు, అనవసరపు ఆడంబరాల మసాలా దినుసులు ఉండవు, అమ్మప్రేమాప్యాయతలకు తోడుగా అలవాటైన కమ్మదనం కట్టిపడేస్తుంది. అచ్చంగా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.