అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, అక్టోబర్ 01, 2019

నానీ’స్ గ్యాంగ్ లీడర్...

వరలక్ష్మి (శరణ్య) ప్రపంచంలో అందరి ఆకలి తన పులిహోరతో తీర్చేయచ్చని నమ్మే ఓ అమాయకపు అమ్మ. ఏడాది క్రితమే చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయి ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది. ప్రియ (ప్రియాంక అరుల్ మోహన్) చదువుకుని ఉద్యోగం చేస్తున్న తెలివైన అమ్మాయి. తనకి ఎంగేజ్మెంట్ అయి పెళ్ళి చేస్కోవాల్సిన అబ్బాయి ఏడాదిక్రితమే దూరమైనా మర్చిపోలేకా ముందుకు వెళ్ళలేకా ఆలోచనలతో సతమతమయ్యే అమ్మాయి. స్వాతి (శ్రియ రెడ్డి) అన్న చాటు చెల్లెలు, ఉన్న ఒక్క అన్నయ్య ఏడాది క్రితమే చనిపోయాడు. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అన్నయ్య ఫోన్ కు మెసేజ్ చేస్తూ తనని ఊహలలో బతికించుకుంటూ...

శనివారం, సెప్టెంబర్ 28, 2019

వాల్మీకి...

వాల్మీకి నుండి "గద్దలకొండ గణేష్" గా ఈ సినిమా పేరు మార్చిన విషయం అందరికీ తెలిసినదే ఐనా నేను కొత్త పేరుతో సినిమాని పిలవదలచుకోలేదు. ఈ విషయంలో సినిమాకి అన్యాయం జరిగిందని అంటాను నేను. కేవలం ఒక సినిమాకి పేరు పెట్టడం వలన దెబ్బతినే ప్రతిష్ట కాదు వాల్మీకి మహర్షిది. ఈ విషయం ఆయన వారసులమని చెప్పుకుంటున్న వారికే తెలియక పోవడం శోచనీయం. ఇలా చివరి నిముషంలో సినిమా రిలీజ్ ఆపేయడం వందలమంది సినీ కార్మికులకూ డిస్ట్రిబ్యుటర్స్ కూ నష్టం కలిగిస్తుంది. అందుకే ఇలాంటి అధికారం ఎవరికీ లేకుండా ఉండేలా ఒక చట్టం వస్తే బావుంటుందని నా అభిలాష. సినిమాలోని ఇలాంటి అభ్యంతరకరమైన విషయాల...

మంగళవారం, ఆగస్టు 20, 2019

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ..

అనగనగనగా ఓ నెల్లూరు.. ఆ ఊర్లో కూరగాయల మార్కెట్ లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీ "FBI". అదేంది అది అమెరికాలో కదా ఉండేది ? అంటారా.. వాళ్ళే వీళ్ళ ఏజెన్సీని చూసి పెట్టుకున్నారుట సార్ మీకు తెలీక పోతే ఆత్రేయని అడగండి వివరంగా చెప్తాడు. అంతెందుకు ఓ రెండేళ్ళ తర్వాత అమెరికా వెళ్ళి FBI అంటే "FBI నా అది నెల్లూర్లోగదా ఉండేది" అని అడుగుతారుట తెలుసా.. అయినా కూరగాయల మార్కెట్ లో డిటెక్టివ్ ఏజెన్సీ ఏంటీ ? అంటారా అసలిలాంటి ఏజెన్సీలు ఇలాగే ఇలాంటి షాపుల్లోనే పెట్టాలిట.. మీకు తెలుసా.. ఇలా పెట్టడమే కాదు ఏదైనా కేస్ పనిమీద బైటకెళ్ళేప్పుడు షట్టర్ క్లోజ్ చేయకుండా లైట్స్ తీసేయకుండా...

మంగళవారం, జనవరి 22, 2019

అమ్మ ప్రేమ...

అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చేవట నా చిన్నప్పుడు. అలాంటి వాటిలో ముఖ్యమైనది బలం లేకపోవడమట. అసలు ఆహారంపై శ్రద్ద లేకపోవడం. ఏం పెట్టినా తినకపోవడం, ఎన్ని తంటాలు పడి ఎంత తినిపించినా బొత్తిగా బలం...

సోమవారం, జనవరి 14, 2019

NTR - కథానాయకుడు...

కథానాయకుడు సినిమా గురించి చాలామందికి ఉన్న సందేహాలన్నీ పక్కనపెట్టవచ్చు. కొందరు అంటున్న మహానటితో పోలికలు, తారక్ లేడు, బాలకృష్ణ యంగ్ గేటప్ బాలేదు, ఎలక్షన్లముందు రిలీజవాలని హడావిడిగా చుట్టేశారు లాంటి మాటలన్నీ మర్చిపోవచ్చు. ఆ హడావిడి ఎక్కడో కొన్నివిషయాల్లో కనిపించినప్పటికీ అతి తక్కువ టైమ్ లో క్వాలిటీ ప్రోడక్ట్ ను అందించారు క్రిష్ అండ్ టీం. అయినా ఈ ఇంటర్నెట్ యుగంలో ఒక సినిమా చూసి ఓటు వేసేవాళ్ళు ఎవరుంటారండీ, కనుక ఇవన్నీ వదిలేసి...   కొన్ని దశాబ్దాల పాటు వెండితెరని ఏలిన మకుటం లేని మహారాజు గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా చూడండి. ఒక...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.