అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, జనవరి 22, 2016

అమ్మ జ్ఞాపకాలతో...

అపుడు నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో.. ఓ మండు వేసవి మిట్ట మద్యాహ్నం.. గుంటూరు నగరం, అరండల్ పేటలో నడిరోడ్డు.. సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. నేను మాత్రం.. "పో.. పోవోయ్ చుప్పనాతి సూరీడా నీ ఎండ నన్నేం చేయలేదు నా దగ్గర మా అమ్మ చీర చెంగుంది.." అని సూరీడ్ని సవాలు చేస్తూ అమ్మ చీర కొంగులో తల దాచేసుకుని.. అమ్మ చేతిని గాట్టిగా పట్టుకుని వడి వడిగా నడుస్తూ ఉన్నాను.. చుట్టూ ఏవో రంగు రంగుల పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి కాని ఇంత లావు కళ్ళజోడు పెట్టుకున్నా కళ్ళు మసక మసక గా ఉండి సరిగా కనపడడం లేదు..  పొద్దున్న వరకూ చక్కగా ఉన్న కంటి చూపుని ఇలా ఐడ్రాప్స్ వేసి...

శుక్రవారం, జనవరి 01, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నేటినుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా... 2016కు మనసారా స్వాగతం పలుకుతూ "నిన్నకీ నేటికీ ఏం మారిందనీ గోడమీద కాలెండరు తప్ప" అంటూ నిరుత్సాహపరిచే ఆలోచనలకు తావివ్వకుండా.. నిన్నటికన్నా రేపు మెరుగ్గా ఉంటుందనే నమ్మకమే నేటికి ఇంధనం కనుక ఆశావహ దృక్పధంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ బ్లాగ్ మిత్రులు అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో మీ దిగుళ్ళు వందోవంతవ్వాలనీ సంతోషాలు వందింతలవ్వాలనీ మనసారా కోరుకుంటున్నాను. బ్లాగులకు సంబంధించినంత వరకూ 2015 వెళ్తూ వెళ్తూ మిగిల్చిన విషాదం కూడలి అస్తమయం. ఇన్నేళ్ళగా తెలుగు బ్లాగులకు...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.