అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

సన్నాఫ్ సత్యమూర్తి...

సన్నాఫ్ సత్యమూర్తి - ’విలువలే ఆస్తి’ - ఆ టైటిల్ కీ ఈ ట్యాగ్ లైన్ కీ వందశాతం జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా ఇది. ఒక సినిమాలో హీరోయిన్ తనపై అటాక్ చేసిన రౌడీలని చితకబాదిన హీరోతో “నాకు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే ఎక్కువ భయమేస్తుంది” అని అంటుంది. అలా ఈ కాలం సినిమాల్లో హీరోలు విలన్ల కన్నా భయానకంగా తయారవుతున్నారు. విలువల సంగతి దేవుడెరుగు కనీసం సగటు మనిషిలా ప్రవర్తించకపోవడమే హీరోయిజం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో... ఒక మంచి అబ్బాయి, మనుషులకు, బంధాలకు విలువనిస్తూ, వదినని తల్లిలా గౌరవిస్తూ, వాళ్ల నాన్న నేర్పిన విలువలను నిలువెల్ల వంట బట్టించుకుని వాటితోనే...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.