అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జనవరి 22, 2014

అమ్మ పెంపకం...

నాకున్న సినిమా పిచ్చి వారసత్వంగా వచ్చినదే... నా చిన్నతనంలో అమ్మా నాన్న ఇద్దరూ కూడా విపరీతంగా సినిమాలు చూసేవారట. నేను చిన్నపిల్లవాడ్ని కదా సో ఒకోరోజు తొందరగా నిద్రపోయినా కూడా అలాగే నన్ను రిక్షాలో వేసుకుని సినిమాకి తీస్కెళ్ళే వాళ్ళట. అప్పట్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అవి ట్రాన్సిస్టర్లు లైసెన్సులు రద్దయ్యి మాములుగా ఛలామణి అవుతున్న రోజులు కనుక రేడియో వినడం ఒక హాబీ అంతే తప్ప క్రేజ్ ఉండేది కాదు టీవీలు ఎవరో కోటీశ్వరుల ఇంట్లో వీసీఆర్ తో చూడ్డానికి మాత్రమే ఉండేవి. నాటకాలు ఇంకా నడుస్తూనే ఉండేవి కానీ సినిమాలంత విరివిగా లభ్యత ఉండేది కాదు...

బుధవారం, జనవరి 01, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారూ... న్యూ ఇయర్ ఈవ్ అని నిన్న ఉదయం నుండి మొదలుపెట్టి ఈ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా పార్టీలలో, గెట్ టుగెదర్ లలో, ఈమెయిల్స్, ట్వీట్స్, ప్లస్ పోస్ట్స్, ఫేస్బుక్ వాల్ పోస్ట్స్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్, ఫోన్ కాల్స్, ఛాట్స్, ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రతిమాధ్యమం ద్వారానూ మీ మిత్రులకి, ఆత్మీయులకి, పరిచయస్తులకి అందరికి శుభాకాంక్షలందించేసి అందుకుని ఉంటారు కదా. ఇక ఈ వేళ్టికి చాలని పడుకునేముందు ఈ బ్లాగ్ ద్వారా కూడా మరొక్కమారు విషెస్ అందుకోండి. మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.