అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013

పిజ్జా...

దదాపు మూడునెలల ఎదురు చూపుల తర్వాత ఇవ్వాళ పిజ్జా చూసి వచ్చాను. ఆగండాగండి పిజ్జా తిని కదా రావాలి చూసి రావడమేంటి అని అహనాపెళ్ళంట లో కోటా లాగా చూరుకు వేళ్ళాడేసి చూస్తూ మంచినీళ్ళు తాగినట్లో లేక 'చూపులు కలిసిన శుభవేళ' లో బ్రహ్మానందం లాగా దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్ళి తినేవాళ్ళ పక్కన నిలబడి పిజ్జావంక పిచ్చి చూపులు చూసినట్టో ఊహించేస్కోకండి మరి. నే చూసింది తినే పిజ్జాని కాదనమాట ఈరోజే విడుదలైన తెలుగు సినిమా ’పిజ్జా’ని. "హ్మ్ పిజ్జానా ఇంకేమీ దొరకనట్లు ఇదేం సినిమా పేరోయ్ ఇది హిట్టైతే రేపొద్దున్న పాస్తా, బర్గర్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు అని దొరికిన...

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

క్రైస్తవ 'కడలి'

కొత్తగా పరిచయమవుతున్న హీరో హీరోయిన్ లూ.. అరవింద్ స్వామీ, అర్జున్ లాంటి నటీనటులతో రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీతో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ’కడలి’ సినిమా మీద నాకు బోలెడు అంచనాలున్నాయ్. అసలు ఈ అన్ని కారణాలకన్నా నాకు సముద్రమంటే ఉన్న చచ్చేంత ఇష్టం ముఖ్య కారణం అని చెప్పచ్చేమో. సముద్రాన్ని అపుడపుడు చూపిస్తేనే మణిరత్నం గారు పిచ్చెక్కిస్తారు, ఇక అదే థీంతో అంటే ఎంత బాగా తీసి ఉంటారో సముద్రాన్ని పోలుస్తూ ఎంత మంచి కథ రాసుకుని ఉంటారో అని గంపెడాశతో ఎదురు చూసాను. విడుదలైన దగ్గర నుండి రివ్యూలు చూస్తూ కాస్త నిరాశపడుతూ ఉన్నా కూడా ఇక ఆగలేక మొన్న ధైర్యం చేసి...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.