అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జనవరి 21, 2009

దారిన పోయే దానయ్య లు !!

ప్రయాణం లో చికాకులు ఎన్ని ఉన్నా చివరికి విమానం శంషాబాద్ విమానాశ్రయం లో ల్యాండ్ అయింది, లగేజి పికప్ కోసం మెల్లగా Baggage Carousel (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) దగ్గరకు చేరుకున్నాను. నేపద్యం లో విమానాశ్రయం సిబ్బంది రక రకాల ప్రకటనలు చేస్తున్నారు వాటిలో ఒకటి, "విమానాశ్రయము నందు మీకు పెయిడ్ పోర్టర్ సౌకర్యము కలదు..మీ సామాను మోయుటకు పోర్టర్ సిబ్బంది సేవలను ఉపయోగించు 'కొన' వచ్చును.." అని అంటూ చెప్తుంది. ఇది చాలా శ్రద్దగా విన్నాడేమో నా పక్కన ఉన్న ఒకాయన పాపం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరపున సాయం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ మీద గయ్ గయ్ మంటూ విరుచుకు పడి పోయాడు. మాములు...

ఆదివారం, జనవరి 11, 2009

ముత్యాల పల్లకి (1976)

నా చిన్నతనం లో నేను చాలా సార్లు విన్న పాటలు ఇవి రెండూ.. అప్పట్లో పెళ్ళికి వెళ్తే "సన్నా జాజి కి..." పాట తప్పని సరిగా వినిపించే వారు. కొన్ని రోజులు గా ఎందుకో ఈ పాటలు గుర్తొస్తున్నాయి. మీరూ ఓ సారి విని గుర్తు చేసుకుని ఆనందించండి. మల్లెమాల గారు రాసిన సాహిత్యం సరళంగా అందం గా ఉంటుంది. తెల్లవారక ముందే పాట, రెండవ చఱణం లో పల్లెల గురించి ఎంత బాగా చెప్పారు అనిపించక మానదు. ఈ సంక్రాంతి సమయం లో పల్లెలు మరింత గుర్తొచ్చి మనసు భారమౌతుంది కదా !!తెల్ల వారక ముందే.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి. చిత్రం: ముత్యాల పల్లకిసంగీతం : సత్యంసాహిత్యం : మల్లెమాలతెల్లా...

గురువారం, జనవరి 08, 2009

నేటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో నా బ్లాగు !!

నా బ్లాగు లో నే రాసుకున్న "నాన్న తో షికార్లు !!" టపాను ఉదహరిస్తూ, ఆంధ్ర జ్యోతి పేపరు వారు నేటి (8th Jan-2009) నవ్య అనుబంధం లో నా బ్లాగు గురించి పరిచయం చేసారు. ఈ సంధర్బంగా ఆంధ్రజ్యోతి వారికీ, నవ్య నిర్వాహకులకు ధన్యవాదములు.నా బ్లాగును కనుగొని, ఓపికగా రెండు టపాల నుండి ఎంపిక చేసిన పేరాలు కూర్చి, స్వల్ప మార్పులతో నా బ్లాగు పరిచయం గా ప్రచురించిన వారికి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.అలానే పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నెనర్లు. బహుశా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.